మోచేతులు నలుపెక్కితే

1
2101

ఏది ముట్టుకోవాలన్నా, పట్టుకోవాలన్నా ఉపయోగపడేది చేతులే. ఇవి తడికి, వేడికి బాగా ఎక్స్ పోజ్ అవుతాయి. చేతులకు బాగా చెమట పడుతుంది. అందువల్ల అనేక ఇబ్బందులకులోనవుతాం. వాటిలో కొన్నింటికి పరిష్కారాలు…

మోచేతుల నలుపు
ఆలివ్ ఆయిల్ తో  మసాజ్ చేసి నిమ్మరసంతో రుద్దాలి. రోజ్ వాటర్ రెండుస్పూన్లు, గ్లిజరిన్ 5 చుక్కలు, ఒక నిమ్మచెక్కరసం మిశ్రమం చేసి మోచేతులకు రాస్తే గరుకుదనం, నలుపురంగు తగ్గుతాయి.

చేతులు మృదువుగా ఉండాలంటే
వాడిన నిమ్మచెక్కలతో రుద్ధితే మోచేతులు, మోకాళ్లు కూడా మృదువుగా అందంగా ఉంటాయి. వెన్నలో ఆల్మొండ్ ఆయిల్ కలిపి పడుకోబోయే ముందు చేతులకు రాసుకుంటే కూడా చేతులు మృదువుగా ఉంటాయి.

గోరుచుట్టు
ములగచెట్టు జిగురు లేక వెల్లుల్లిని నీటితో తడిపి మెత్తని ముద్దలా నూరి దానిని గోరుచుట్ట మీద ఉంచితే మంచి ఫలితం వస్తుంది.

పిప్పిగోళ్లు
కరక్కాయ బెరడును, పసుపుకొమ్మ రసంతో బాగా నూరి ఆ ముద్దను పిప్పిగోళ్ల మీద కొన్ని రోజుల పాటు రాస్తే మంచి ఫలితముంటుంది.

భుజాలు, చేతులు నల్లగా మారితే
మీగడ, చిటికెడు పసుపు, 2–3చుక్కల తులసి రనం కలిపి ముద్దచెయ్యాలి. ఈ ముద్దను రాత్రంతా సంబంధిత ప్రదేశాలపై రాసి ఉంచాలి. ఇలా క్రమం తప్పకుండా వారంరోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.

1 COMMENT

  1. మంచి విషయాలుసెలవచ్చినారు.ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here