ద్వాపర యుగాంతం | Dwapara yugantham in Telugu

0
13046

end of dwaparayuga

ద్వాపర యుగాంతం | Dwapara yugantham in Telugu

శ్రీ మహా విష్ణువు శ్రీ కృష్ణునిగా అవతరించిన యుగం ద్వాపర యుగం. ఈ యుగం లోనే మహా భారత యుద్ధం జరిగింది. అందుకు ఆనవాళ్ళు పురావస్తుశాఖ ఇటీవలికాలం లో ప్రపంచానికి వెల్లడించింది. శ్రీ కృష్ణుడు నడయాడిన ద్వారకా నగరం సముద్ర గర్భం లో వెలుగుచూసింది. హిందూ మత గ్రంథాల ద్వారా నాలుగు యుగాలలో మూడవదైన  ద్వాపర యుగం కాల పరిమితి 864,000 మానవ సంవత్సరాలు.

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన చాలా సంవత్సరాలకు పాండవాదులు గతించిన తరువాత  యాదవ కులం లో ముసలం పుట్టింది. బలరాముడు యోగమార్గం లో శరీర త్యాగం చేశాడు. కృష్ణుడు ఒక నిషాదుని ( పూర్వజన్మలో వాలి) బాణం వలన గాయపడి దేహాన్ని త్యజించాడని కొన్ని పురాణాలలో ఉంది. శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపరయుగం అంతమయింది. కలియుగం ఆరంభమయింది. ఇది క్రీ.పూ. 3102 ఫిబ్రవరి 17/18 తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి(అయితే ఈ అంచనాలలో పలు అభిప్రాయ భేదాలున్నాయి).  వైశాఖ శుక్ల అష్టమి ద్వాపర యుగాంతం గా భాగవత పురాణం చెబుతున్నది.

Dwapara yugantham in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here