శిరస్సు లేని అమ్మ వారు! ఆ స్థానంలో ఏముంటుందంటే?! Erukumamba Temple Visakhapatnam

0
879
Erukumamba Temple Visakhapatnam
Erukumamba Temple Vizag

Erukumamba Temple Amma Idol Has No Head

1ఎరుకుమాంబ ఆలయ అమ్మవారి విగ్రహానికి తల లేదు!

హిందు ఆలయాలు అంటే ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. రహస్యాలు, అందమైన శిల్పాలు, సుందరమైన దేవతా మూర్తులు ఇలా ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. మాములుగా అయితే ఆలయంలోకి ప్రవేశించగానే దేవతా విగ్రహాని పై నుంచి పాదాల వరకు కనులార చూసుకోని మొక్కుతాం. ఆ ముఖారవిందాన్ని చుసి తన్వయత్వానికి లోనవుతాం. కాని ఇప్పుడు చెఉప్పుకునే ఆలయంలో అమ్మ వారికి శిరస్సు ఉండదు. మరీ ఆ స్తానంలో ఏమి ఉంటుంది అంటే ఓంకారం చేక్కబడిన ఒక పళ్ళేం ఉంటుంది. అదే విశాఖపట్నం జిల్లా దొండపర్తిలో కొలువై ఉన ఎరుకుమాంబ అమ్మ వారు. ఏ అమ్మ వారికైన చీర, పళ్లు, పంచ భక్ష పరమాన్నాలను పెడతారు. కానీ ఎరుకుమాంబ అమ్మ వారికి నీళ్లు మొక్కుకుంటే చాలు అడిగిన వరాలు ఇస్తుందని భక్తుల ప్రగాడ నమ్మకం. ఇక్కడ వెలసిన అమ్మవారి విగ్రహానికి శిరస్సు మెడపై కాకుండ అమ్మవారి కాళ్ళ వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో సత్యం గల తల్లిగా ఎరుకమాంబను భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం అని భక్తుల విశ్వాసం. ఏడో శతాబ్దం నుంచి అమ్మ కొలువైయ్యారని స్థలపురాణం చెబుతోంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back