బాల హనుమంతుని లీల | Bal Hanuman Leela in Telugu

0
4274
Fables of Bala Hanuman
బాల హనుమంతుని లీల | Bal Hanuman Leela in Telugu

 Bal Hanuman Leela in Telugu మహాశివుని అంశగా అంజనాదేవి గర్భాన జన్మించిన అతులిత పరాక్రమ శాలి ఆంజనేయుడు. వాయుదేవుని వరపుత్రుడైన ఆంజనేయుడు పసితనం నుంచే అమిత బలవంతుడు.

ఒకనాడు ఆకలిగా ఉందని మారాం చేశాడు. అంజనాదేవి పెట్టిన ఆహారం సరిపోలేదు. ఆకలికి తాళలేని ఆ అల్లరి పిల్లవాడు దిగులుగా ఆకాశం వైపు చూశాడు.

అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అతనికి నారింజ పండులా తోచాడు. అంతే ఒక్క ఉదుటున ఆకాశానికెగిరి సూర్యుని నోటబెట్టుకున్నాడు. ఉదయభానుని ఆంజనేయుడు నోట్లో పెట్టుకోగానే లోకాలన్నీ కారు చీకట్లు కమ్ముకున్నాయి.

ఈ హఠాత్ పరిణామానికి కలవర పడ్డ దేవతలంతా ఆంజనేయుని ప్రార్థించారు. అప్పుడు ఆంజనేయుడు సూర్యుని వదలిపెట్టాడు. తిరిగి లోకాలన్నీ కాంతివంతమైనాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here