గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు | About Rose Face pack in Telugu

0
3847
11910879_878045172243249_1497097122_n
గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు | About Rose Facepack in Telugu

గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు

 

గులాబీతో పెరుగు
కొన్ని గులాబీరేకల్ని గంటపాటు నీళ్లలో నానబెట్టి తరువాత పూర్తిగా రుబ్బాలి. ఆ గులాబీ పేస్టుకి, పెరుగూ, నిమ్మరసం తేనె కలిపి ముఖానికి, మెడకు రాసుకుని పావుగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి.

దీనిని జిడ్డు, పొడిచర్మతత్వాలున్న వాళ్లు వాడొచ్చు.
ఓట్స్‌ కలిపి…


గులాబీ రేకల్ని అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. స్పూన్‌ వెనుకభాగంతో వాటిని బాగా నలిపేసి, ఓట్స్‌ పొడి కలపాలి. ఈ మిశ్రమం ఫేస్‌ప్యాక్‌లా ఉపయోగపడుతుంది. స్క్రబ్‌లా, క్లెన్సర్‌లా కూడా వాడుకోవచ్చు.

ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకునే ముందు ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. రోజ్‌వాటర్‌తో శుభ్రపరచుకున్నాక ఈ ఫేస్‌ప్యాక్‌ని వేసుకోవాలి. బాగా ఎండిన తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
శనగపిండితో…


గులాబీ రేకల్ని బాగా మెత్తగా చేసి, శనగపిండినీ, పెరుగునీ కలపాలి. దీనికి కొంచెం రోజ్‌వాటర్‌ని కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక మొదటపాలతో, తరువాత నీళ్లతో కడిగేయాలి. దీంతో చర్మం మృదువుగా అనిపిస్తుంది.


చందనంతో…
మొటిమలూ, జిడ్డు చర్మతత్వం ఉన్నవారికోసమే ఈ ఫేస్‌ప్యాక్‌, గులాబీరేకల పేస్టుకి, చందనం పొడి, కొన్ని చుక్కల తేనె కలుపుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకీ రాసుకుని పావుగంటయ్యాక చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.


పసుపుతో కలిపి…
గులాబీ రేకల్ని ఎండబెట్టి పొడిచేసి ఒక డబ్బాలో దాచుకుంటే, అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.


గులాబీ రేకల పొడికి చందనం పొడి, కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌, చిటికెడు పసుపు కలిపి మెత్తని పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక మొదట పాలతో తరువాత చన్నీళ్లతో శుభ్రపరచుకోవాలి.


ముఖానికి రోజ్‌వాటర్‌ పట్టించడం వల్ల నల్లమచ్చలు, మొటిమలు నియంత్రణలో ఉంటాయి. చర్మసంబంధిత సమస్యలు తలెత్తవు.


గులాబీపువ్వు వాసన చూస్తే గుండెకు బలం వచ్చి జలుబు తగ్గుతుంది. దీని రసాన్ని పిండి తలకు రాసుకుంటే తలనొప్పి తొందరగా తగ్గుతుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here