సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఫేస్‌ప్యాక్‌ | Facepack Without Side Effects in Telugu

1
5024
facepack
సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఫేస్‌ప్యాక్‌ | Facepack Without Side Effects in Telugu

సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఫేస్‌ప్యాక్‌ | Facepack Without Side Effects in Telugu

మనం నిత్యం కూరల్లో తప్పనిసరిగా వాడే టొమాటో చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని టొమాటో ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

టొమాటోలో విటమిన్లూ, పోషకాలూ కావల్సినన్ని ఉంటాయి. ఇవి సౌందర్య పోషణకు చక్కగా ఉపయోగపడతాయి.

రెండు చెంచాల టొమాటో రసంలో మూడు చెంచాల మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది.

చెంచా చొప్పున టొమాటో రసం, తేనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖానికి మెరుపొస్తుంది.

ఒక బౌల్‌లో రెండు టొమాటోలను గుజ్జుగా చేసుకోవాలి. అందులోకి ఓట్‌మీల్‌, పెరుగు ఒక టేబుల్‌ స్పూన్‌ చొప్పున వేసి మిశ్రమంగా కలపాలి.

ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే ఎండ తాకిడికి గురై కమిలిన చర్మంలో కాంతి వస్తుంది.

తాజా టొమాటో మధ్యలోకి కోసి ఆ ముక్కని పంచదారలో అద్దాలి. దానిపై కొద్దిగా చిక్కని పెరుగు వేసి, దాంతో ముఖం రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి.

ముఖంపై పేరుకున్న నలుపుదనమూ నెమ్మదిగా దూరమవుతుంది.

టొమాటోని మెత్తగా చేసి దానికి చెంచా పెరుగూ, అరచెంచా తేనె, మూడు చెంచాల సెనగపిండీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక కడిగేస్తే ఫలితం ఉంటుంది.

టొమాటోను గుజ్జుగా చేసుకుని అందులోకి ఒక టీస్పూన్‌ తేనెను వేసి మిశ్రమంగా కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కాసేపయ్యాక కడుక్కుంటే మంచి గుణం ఉంటుంది.

టొమాటోని గుజ్జులా చేసి దానికి చెంచా నిమ్మరసం, అరచెంచా ఓట్స్‌ పొడీ కలిపి ముఖానికి రాసుకుని, కాసేపు వేళ్లతో రుద్దాలి. తరవాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

ఒక ముక్క టొమాట రసం, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. మరీ పల్చగా ఉందనుకుంటే సెనగపిండ కానీ, ముల్తానీమట్టి కానీ కలిపి చిక్కగా చేసుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా రాసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు ప్యాక్ వేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది.

రెండు చెంచాల టొమాటో గుజ్జులో, చెంచా కీరదోస గుజ్జూ, రెండు చెంచాల ఓట్స్‌ పొడీ, చెంచా పుదీనా ఆకుల మిశ్రమం కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌తో ముఖానికి తాజాదనం వస్తుంది.

ఒక ముక్క టొమాటో రసానికి చెంచా కొత్తిమీర రసం కలపాలి. ప్యాక్ వేసుకోవాలంటే చిక్కగా ఉండాలి కాబట్టి అవసరం మేరకు కొద్దిగా ముల్తానీ మట్టి కలుపుకోవాలి.

దీన్ని ముఖానికీ, మెడకీ పట్టించి ఆరిన తరువాత కడిగేస్తే సరిపోతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here