మనం నిత్యం తాగే “టీ” ముఖ్యంగా నాలుగు రకాలు. వైట్, గ్రీన్, బ్లాక్, వూలాంగ్ (బ్లాక్ డ్రాగాన్ టీ). ఈ టీ ఆకులన్నీ Camellia sinensis అనే టీప్లాంట్ నుంచే వస్తాయి.
కాకపోతే ఆకులను “స్టీమ్ చేయటం“, “ఫెర్మెంట్ చేయటం“(oxidation), “ఎండబెట్టడం” మొదలైన ప్రోసెసింగ్ విధానంలో తేడా వల్ల వాటికి ఆ యా పేర్లు, ప్రత్యేకమైన రుచులు వచ్చాయి.
మిగిలిన టీలన్నింటిలోకీ “బ్లాక్ టీ” కొద్దిగా స్ట్రాంగ్ గానూ, ఎక్కువ కెఫీన్ ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం నేను చెప్పబోయేది ఆరోగ్యకరమైన “గ్రీన్ టీ” గురించి. చైనా లో పుట్టిన ఈ గ్రీన్ టీ ఈ మధ్యనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది.
అతి తక్కువగా ఫెర్మెన్ట్ చేయబడ్డ టీ ఆకులు ఇవి. గ్రీన్ గ్రీన్ టీ కూడా చాలా వరైటీలు ఇప్పుడు లభ్యమౌతున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వైద్య పరమైన రీసర్చ్ లు, ప్రయోగాల వల్ల గ్రీన్ టీకు సంబంధించిన ఎన్నో ప్రయోజనాలూ, ఉపయోగాలూ కనుగొనబడ్డాయి. గ్రీన్ టీ తాగటo వల్ల చేకూరే ఆరోగ్యపరమైన కొన్ని
ఉపయోగాలు:
- గ్రీన్ టీలో EGCG (Epigallocatechin Gallate) అనే శక్తివంతమైన anti-oxident ఉంది. (anti-oxidents శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కాపాడతాయి).
- రెగులర్ గా గ్రీన్ టీ త్రాగేవారికి “హార్ట్ డిసీజెస్” వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.
- కొన్నిరకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి ఈ టీ లో ఉంది.
- అధిక బరువును తగ్గిస్తుంది.
- రోజూ గ్రీన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
- బేక్టీరియాను నివారించే సామర్ధ్యం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ ను రానివ్వకుండా చేయటమే కాక పళ్ళ ను కూడా సురక్షితంగా ఉంచగలుగే శక్తి గ్రీన్ టీకు ఉంది.
- గ్రీన్ టీ చర్మ రక్షణకు, సౌందర్యపోషణకు కూడా ఉపయోగకరం అని శాస్త్రవేత్తలు కనుగొనటమ్ వల్ల మార్కెట్లో గ్రీన్ టీ తో తయారు చేసిన సబ్బులు, షాంపూలూ, డియోడరెంట్ళు, క్రీమ్లు కూడా లభ్యమౌతున్నాయి.
మరి ఇన్ని ఉపయోగాలున్న గ్రీన్ టీ ను రోజూ తాగటం మొదలెట్టేయండి. నేను రెండు సంవత్సరాల నుంచీ రోజూ మధ్యాహ్నాలు తాగుతున్నాను.
మార్కెట్లో దొరికే గ్రీన్ టీబ్యాగ్స్ కన్నా , గ్రీన్ టీ ఆకులను కొనుక్కుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో త్రాగచ్చు.
Good ingormation
Very useful information sir
thanks to your good advices to public