నాన్న ఎప్పుడూ ఒంటరివాడే

1
3894

 

 

నాన్న ఎప్పుడూ ఒంటరివాడే,
అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.
నాన్న ఎప్పుడూ తుంటరివాడే,
అమ్మమాత్రమే తరుచూ మంచిది అవుతూ ఉంటుంది,
పిల్లల దృష్టిలో.
కని,పెంచటం అమ్మే అన్నట్లు కనిపిస్తుంది,
నాన్నబాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది.
కనటం అమ్మే అయినా కలలుకనటం నాన్న పనేనని
ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?
పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్న వల్లేనని,
కొంతమంది పిల్లలకే బోధపడుతుంది.
సేవచేయటం అమ్మ వంతు,
సరిచేయటం నాన్న తంతు.
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి,
నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతోపాటు
దోషాలు కూడా కనబడుతాయి.
ప్రేమించటం అమ్మ వంతు అయితే,
దీవించటం నాన్న వంతు.
ఆకలి తీర్చటం అమ్మ వంతు అయితే,
ఆశలు తీర్చటం నాన్నవంతు.
అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది,
నాన్న దీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది.
అమ్మ గుండెలో పిల్లల సుఖానికి
సంబంధించిన ఆలోచనే ఉంటుంది.
నాన్న గుండెలో పిల్లల క్షేమానికి
అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.
అమ్మ ఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి,
నాన్న ఆత్రుతని కళ్ళు మాత్రమె చెపుతాయి.
కనిపించే ఆరాటం అమ్మది,
కనిపించని పోరాటం నాన్నది.
అమ్మకి లైకులెక్కువ,
నాన్నకి షాకులెక్కువ.
అమ్మ ఏడవటం కనిపిస్తుంది,
నాన్నఎద చెరువవటం కనిపించదు.
గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ,
గుర్తింపు పొందని దేవుడు నాన్న..


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

  1. చాలా చక్కని కవిత —నాన్న అనే వ్యక్తి గురించి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here