నట్టింట సిరులు కురవాలన్నా ,లక్ష్మీ దేవి మీ ఇంట స్థిరంగా నిలవాలన్నా ఇలా చేయండి ? | Facing Direction of God Idol in Home According to Vastu in Telugu

4
71107
6905472_f496
నట్టింట సిరులు కురవాలన్నా ,లక్ష్మీ దేవి మీ ఇంట స్థిరంగా నిలవాలన్నా ఇలా చేయండి ? | Facing Direction of God Idol in Home According to Vastu in Telugu
Back

1. లక్ష్మీ దేవి ఎక్కడ నిలిచి ఉంటుంది?

పరిశుభ్రంగా ఉన్న ఇంటిలో, ముగ్గుతో కళకళ లాడుతున్న ముంగిలిలో,పసుపు రాసిన గడపలో,పెద్దలను , గురువులను గౌరవించేవారి ఇంటా,అతిథులను ఆదరించేచోటా లక్ష్మీ దేవి ఉంటుంది. యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతా  ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా నిలిచి ఉంటారు. ఏ ఇంట్లో అయితే ప్రాతస్సంధ్యలలో దీపాన్ని వెలిగిస్తారో, ఏ ఇంట్లో అయితే సూర్యోదయానికి ముందే ఇంటిల్లిపాదీ నిద్రలేచి శుచిగా ఉంటారో, ఏ ఇంట్లో సాయం సంధ్యలలో నిద్రపోకుండా ఉంటారో అటువంటి ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది.

లక్ష్మీ దేవికి చంచల అన్న పేరు కూడా ఉంది. అంటే ఆమె ఎక్కడా స్థిరంగా ఉండదు అని అర్థం. కానీ ప్రతి ఇంటిలోనూ ఉండే కొన్ని వస్తువులలో ఆమె నిలిచి ఉంటుంది. ఆ వస్తువులకు తగిన విలువ ఇవ్వడం ద్వారా ఆమె సంతుష్టి చెంది ఆ ఇంట్లో నివాసం ఏర్పరుచుకుంటుంది. 

Promoted Content
Back

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here