చక్కటి సంతానము కోసం

0
2203

05.06.2022 – ఆదివారం – అరణ్య షష్ఠి, వన గౌరీ వ్రతం, శీతలా షష్ఠి 

ఈ రోజు గౌరీ వ్రతం చేయడమే కాక ముఖ్యంగా స్త్రీలు షష్ఠీ దేవిని, కార్తికేయుని కలిపి అరణ్యమందు లేదా కదంబవృక్షపు నీడలో గానీ, ఇంటిలో కానీ పూజిస్తే వారి గర్భములు నిలిచి చక్కటి సంతానము కలుగుతుంది. సంతానము గలవారికి రక్షణ లభిస్తుంది. ఈ రోజున ఋగ్వేదంలోని ఆరణ్యక సూక్తం పఠించడం/పఠింపజేయడం మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ఈ రోజున శివ పార్వతుల కళ్యాణము జరిపించడం కూడా కళ్యాణదాయకం. ఉత్కళ రాష్ట్రం మొదలైన అనేక ప్రాంతాలలో ఈ కళ్యాణం జరిపించడం ఎక్కువగా ఆచరణలో ఉంది.

శీతలాషష్ఠి కూడా కనుక ఈ రోజున శీతలాదేవి స్తోత్రము, నామము – 

శీతలే త్వం జగన్మాతా శీతలే త్వం జగత్పితా, 

శీతలే త్వం జగద్ధాత్రీ శీతలాయై నమో నమః. 

రాసభో గర్దభశ్చైవ ఖరో వైశాఖనందనః, 

శీతలావాహనశ్చైవ దూర్వాకందనికృన్తనః

– లను జపించడం వలన రోగబాధలు నశించి శీతలాదేవి అనుగ్రహాన్ని పొందవచ్చును.

– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 

శ్రీ శీతలాష్టకం – Sri Seethalashtakam in Telugu