
సంతాన యోగం కోసం
సంతాన గోపాల స్వామి ని ఎవరు పూజించాలి.?
ఎవరికైతే సంతాన భాగ్యం లేదో, చాలా కాలం నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు. సత్ సంతానం కోసం ఈ ఈ క్రింది మంత్రం ప్రతి రోజు 108 సార్లు 40 రోజులు జపించాలి. సంతాన గోపాల మంత్రం పఠిస్తే ఫలితం ఉంటుంది. సంతాన గోపాల మంత్రాన్ని గురుపదేశం లేకుండా పఠించడం మంచిదికాదు. గురువు వద్ద ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని అప్పుడు జపాన్ని ప్రారంభించాలి.
మం.|| ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ఓం నమో భగవతే వాసుదేవాయ.
మంత్రోపదేశం కుదరనివారు సంతాన గోపాల స్తోత్రం 41 రోజులపాటు పఠించడం వలన శీఘ్రమే సంతానప్రాప్తి కలుగుతుంది.