అధిక రక్తపోటుకు ఆయుర్వేదపరమైన చికిత్స

0
3095
27-wellness27-600-300x225
అధిక రక్తపోటుకు
భోజనంలో వెల్లుల్లి ముఖ్యం :
తిండితో వెల్లుల్లి తింటే రక్తపోటులో తగ్గుదల ఉంటుంది. అంటే అధిక రక్తపోటుగల వారి విషయంలో రక్తపోటు తగ్గుతుంది. 47 మంది అధిక రక్తపోటు గల వ్యక్తులకు అనుదినం 600 మిల్లీగ్రాముల వెల్లుల్లి (అంటే సుమారు మూడు లేక నాలుగు వెల్లుల్లి పాయలు) వారి తిండితోపాటు ఇవ్వడం వల్ల వారి అధిక రక్తపోటు 11 శాతం తగ్గినట్లు గుర్తించారు.

చేపలు తినండి : ఒమేగా-3 ఫాటీ అమ్లాలు సముద్రపు చేపలైన మేకరల్‌, సాలమన్‌ లలో వుంటాయి. వీటిని తింటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఈ చేపల నూనెను సేవించిన 16 మంది అధిక రక్తపోటుగల రోగు లలో రక్తపోటు తగ్గుదలను పరిశీల కులు గమనించారు. అయితే రక్తపోటు తగ్గుదలకు చేప నూనెకు మధ్యగల సంబంధాన్ని ఇంకా పరిశోధకులు స్పష్టంగా నిర్థారించవలసి ఉంది. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు తినండని ఈ రంగంలోని నిపుణులు అధిక రక్తపోటుగలవారికి సలహా ఇస్తున్నారు.

పీచు ఎక్కువగల పదార్థాలు తినండి :
తినే తిండిలో ఎక్కువ పీచుగల పదార్థాలు ఉంటే అధిక రక్తపోటు బాగా తగ్గుతుంది. 20 గ్రాములు అధికంగా పీచుగల పదార్థాలు తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాదు రక్తంలో కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.
తాజా పళ్ళు, కాయగూరలు వంటివి పీచు ఎక్కువగా గల పదా ర్థాలు. అందు కే వాటిని కొంచెం ఎక్కువగా తినడం అలవరచుకోవాలి.

ఒక మోస్తరు బరు వులు ఎత్తే వ్యాయా మం చేయండి :
ఔషధాలు వాడడం వల్ల రక్తపోటు అదుపు లోకి వచ్చే విధంగా ఒక మోస్తరు బరువులు ఎత్తే వ్యాయామం వల్ల కూడా సాధ్యమవుతుందని పరిశీలనలో వెల్లడయ్యింది. అయితే బరువులు ఎత్తడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు, గుండె సమస్యలు గలవారు ఈ రకం వ్యాయామం చేయడానికి ముందు డాక్టరు సలహా లేదా అనుమతి తీసుకోవాలి.

నడవండి, పరుగెత్తండి, సైకిలు తొక్కండి :
క్రమం తప్పని ఏరోబిక్‌ వ్యాయామాలు అధిక రక్తపోటును తగ్గించడమేకాదు, అసలు అధిక రక్తపోటు రాకుండా నిరోధిస్తాయి. మంచి శరీరాకృతి వ్యాయా మాల వల్ల పొందిన వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

4,600 మంది వ్యక్తులను అధ్యయ నానికి తీసుకుని అయిదు సంవత్స రాలు వారిపై పరి శోధక బృందాలు పరిశీలనలు జరి పాయి. ఏరోబిక్‌ వ్యాయామాలు చేసిన వారికి రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా, వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండడం కూడా పరిశోధకులు గమనించారు.

బరువు తగ్గాలి :
శరీర బరువును తగ్గించుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. పరిశోధకులు తమ పరిశోధనలలో బరువు తగ్గించుకున్న కొంతమందిలో నాటకీయంగా అధిక రక్తపోటు బాగా అదుపులోకి రావడం గమనించారు.

60 శాతం అధిక రక్తపోటుగలవారు బరువు తగ్గించుకోవడం వల్ల మందులు వాడనవసరం లేకుండా రక్తపోటు అదుపులోకి రావడం పరిశీలకులు గుర్తించారు.

విటమిన్‌ ‘సి’ తీసుకోండి :
విటమిన్‌ ‘సి’ అధికంగా తీసుకునేవారికి రక్తపోటు తక్కువగానే వుంది. విటమిన్‌ ‘సి’ తక్కువగా తీసుకునేవారికి అధిక రక్తపోటు
ఉంది. ఈ విశేషాన్ని పరిశీలకులు పలు పరిశీలనలు చేసి తెలుసుకున్నారు.

మీరు తినే తిండిలో విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండేందుకు తప్పక జామపండు , ఉసిరి, టొమాటోలు, నిమ్మపండ్లు మొదలయినవి తినడంవల్ల సమృద్థిగా ‘సి’ విటమిన్‌ లభిస్తుంది. విటమిన్‌ ‘సి’ టాబ్లెట్స్‌ కూడా తీసుకోవచ్చు.

పొటాషియం తీసుకున్నా రక్తపోటు తగ్గుతుందని పలువురి పరిశోధకుల సలహా, కనీసం రోజుకు 2000 మిల్లీగ్రాముల పొటాషియం తీసు కోవా లంటున్నారు. కాల్చిన ఒక బంగాళా దుంపలో 844 మిల్లీ గ్రాముల పొటా షియం ఉంటుం ది. ఒక అరటిపండులో 451 మిల్లీగ్రాముల పొటా షియం ఉంటుంది.
ఖర్జూరపుపండు, వెన్నతీసిన పాలు, వంటి వాటిలో కూడా తగినంత పొటా షియం ఉంటుంది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here