ముందు మాట

1
1429
ముందు మాట

ముందు మాట

మానవ జీవితమంటేనే సుఖ, దు:ఖాల వలయం. దీనికి మూలం మనం గత జన్మలో చేసుకున్న పాప, పుణ్యముల ఫలియతములతో పాటు ఈ జన్మలో మన పుట్టకకు కారణం అయిన వంశ పూర్వీకులు /పెద్దలు చేసిన పాప, పుణ్యాల ఫలితమనే చెప్పవచ్చు. దాని ప్రభావము వలనే  మన పుట్టుక సమయంలో ఉన్న గ్రహ కూటములు ఆయా సమయములలో అనుకూలముగాను, మరికొన్ని సమయములలో వ్యతిరేకముగా ఆయా గోచార స్థితి గతులను అనుసరించి ఫలితములను ఇస్తూ ఉంటాయి.

అందువలనే ఆయా సమయాలలో వివిద గ్రహ కూటముల ద్వారా ఏర్పడే (గోచార) దోషాల వలన ఏర్పడే సమస్యల నుండి రక్షణ కొరకు మన పూర్వీకులు అయిన మహర్షులు ఎంతో శ్రమించి, చరిత్రలో కలిసి పోని  విదంగా సాంప్రదాయాల రూపంలో / పండుగల రూపము లో పరిహారములను శాస్త్ర బద్దముగా  తెలియజేయడం జరిగింది.

అయితే ఈ పరిహారములను అనేక పద్దతుల ద్వారా తెలియజేసినప్పటికినీ ….., అందులో ప్రస్తుత కలి ప్రభావము వలన ఆయా పరిహారము ఫలితములను ఇచ్చుటకు ఎక్కువ సమయం పట్టడమో లేదా కొన్నింటికి ఎక్కువ ఖర్చు అవ్వడం వలనో లేదా నిపుణులైన పండితుల లేమి కారణం వలనో ఎక్కువ మంది ప్రజలు ఇబ్బందులనుండి బయట పడలేక పోతున్నారనే చెప్పవచ్చు. అటువంటి వారికోసమే మన మహర్షులు కనీనిక నాడీ గ్రంధముల ద్వారా అతి రహస్యముగా చెప్పబడిన తంత్ర పరిహారములను వివరంగా మీకు అందించే ప్రయత్నమే ఈ శరన్నవరాత్రుల పూజా విదానము తో కూడిన గ్రందము అని చెప్పవచ్చు.

మిగతా పరిహారముయిలకు ఈ తంత్ర పరిహారములతో కూడిన పూజా విధానమునకు తేడా ఏమిటంటే ఇందులో ఖర్చు తక్కువగాను, ఫలితం త్వరగాను ఉండటమే.

                                                    అహం బ్రహ్మాస్మి
మీ రాఘవేంద్ర సిద్దాంతి
నాడీ జోతిష్య పరిశోధకులు

1 COMMENT

  1. ఉపయోగకరమైన చక్కటి విషయాలు తెలియచేస్తున్నారు. ధన్యవాదములు.
    ప్రణామములు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here