గురు గ్రహ అనుగ్రహం కోసం “పసుపు కొమ్ము” గణపతి. | Guru Graha Anugraham in Telugu

0
15075

 

 
గురు గ్రహ అనుగ్రహం కోసం “పసుపు కొమ్ము” గణపతి. | Guru Graha Anugraham in Telugu

 అసలైన పసుపు కొమ్ము మీద గణపతి ఆకారాన్ని చెక్కబడిన గణపతిని పూజించిన గురు గ్రహ అనుగ్రహం కలుగుతాయి.

జాతకచక్రంలో గురువు అనుకూలంగా లేనివారు పసుపు కొమ్ము గణపతిని పూజిస్తే వ్యతిరేక పలితాల నుండి విముక్తి కలుగుతుంది.

పసుపుకొమ్ము గణపతిని పూజామందిరంలో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరిచి దానిపై గణపతిని ప్రతిష్టించాలి.

పసుపుకొమ్ము గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి.పసుపుకొమ్ము గణపతిని పూజ అనంతరం పురుగు పట్టకుండా భద్రపరుచుకోవాలి.

“ఓం హరిద్రా గణపతయే నమః” అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించాలి.

గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదగడానికి ఆకాశమంతటి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మార్గాన్ని సూచించేది …

ఆ దిశగా నడిపించేది గురువే. అలాంటి గురువు అనుగ్రహం కోసం దేవతల గురువైన ‘బృహస్పతి’ని ప్రార్ధిస్తుంటాం.

గురు గ్రహం … ఒక రాశి నుంచి బయలుదేరి తిరిగి అదే రాశికి చేరుకోవడానికి ‘పుష్కర కాలం’ పడుతుంది. మేధో పరమైన ఉన్నత లక్షణాలను ప్రసాదించే గురువు, కొన్ని రకాల వ్యాధుల బారిన పడటానికి కారకుడు అవుతుంటాడు.
జాతకంలో గురువు స్థానం సరిగ్గా లేనప్పుడు కాలేయ సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఇక పైకి తెలియకుండా లోలోపల విస్తరించే షుగర్ … కేన్సర్ వంటి వ్యాధులు కూడా గురువు అనుగ్రహం లేకపోవడం వల్లనే కలుగుతాయి.

అయితే గురుగ్రహం నుంచి ప్రసరించే దుష్ఫలితాల బారి నుంచి కొంతలో కొంత తప్పించుకునే మార్గం లేకపోలేదు. దత్తాత్రేయుడు …

రాఘవేంద్ర స్వామి … శిరిడీ సాయిబాబా … రామకృష్ణ పరమహంస వంటి గురువులను పూజించడం వలన … బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు.

దక్షిణా మూర్తిని స్మరించడం వలన గురువుని శాంతింపజేసి, ఆయన నుంచి వస్తోన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయట పడవచ్చు.

శనగలు గురు సంబంధమైన ధాన్యంగా చెప్పబడ్డాయి కనుక, వాటిని దానం చేయడం వలన కొంత ఉపశమనం లభిస్తుంది.

మొత్తంగా గురు పారాయణం … గురు ధ్యానం … గురు స్మరణ … గురుసేవ మాత్రమే గురువు అనుగ్రహానికి కారణమవుతాయి …

అనేక వ్యాధుల బారినుంచి అవి దూరంగా ఉంచుతాయి.ముఖ్యంగా సంతాన సమస్యలు ఉన్నవారు పసుపు కొమ్ము గణపతిని పూజించాలి.

హరిద్ర గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజిస్తే ఇంటికి ,ఇంట్లో ఉన్నవారికి అన్ని ఆటంకాలు తొలగుతాయి. అన్ని విధాల ధన ,కనక ,వస్తు ,వాహనాలు వృద్ది చెందుతాయి .
పసుపు గణపతి లేక హరిద్ర గణపతి పూజవలన దేహ కాంతి పెరుగుతుంది .సమస్త చర్మ రోగాలు నయం అవుతాయి .

పసుపు గణపతి లేక హల్దిగణపతి లేక హరిద్ర గణపతి పూజతో పాటు గౌరీ దేవీని పూజించటం ద్వార ఇంట్లో వుండే వధువుకు లేక వరుడుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోతాయి త్వరలో వివాహం నిశ్చయం అవుతుంది.

హరిద్ర గణపతిని పూజించి దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి .దుకాణల్లో చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలివుండే వస్తువులఫై హరిద్ర గణపతిని తాకిస్తే వెంటనే వ్యాపారం అవుతుంది.

హరిద్ర గణపతిని పూజిస్తే వారికి డబ్బు సమస్య రాదు .అప్పుల బాధ తొలగిపోతుంది.
కామెర్లు ఉన్నవారి ఇంటి వారు హరిద్ర గణపతిని దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలిగిపోతుంది.

ప్రతి సంవత్సరం కామెర్ల రోగం వచ్చేవారు సుమంగుళకు హరిద్ర గణపతితో పాటు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు .

హరిద్ర గణపతికి హరిద్ర మాలను అలంకరింపజేసి పూజిస్తే దైవకళ పెరుగుతుంది .
వ్యాపారం జరగని దుకాణాల్లో దక్షిణావృత శంఖాన్ని, హరిద్ర గణేశ్, హరిద్ర మాలతో పాటు పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లా పెట్టిలో ఉంచితే వ్యాపారం వృద్ది అవుతుంది.

గురువు జాతకచక్రంలో ఏ అవయవానికి ఆదిపత్యం వహిస్తాడో దాని సహజ పరిమాణాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తాడు.

స్ధూలకాయులు,షుగర్,కాలేయ,కాన్సర్,ఉన్నవారు పసుపు కొమ్ము గణపతిని పూజిస్తూ పాలల్లో ఒక చిటికెడు పసుపు గాని ,మెంతి పొడిగా గాని వేసుకొని త్రాగితే గురు గ్రహ అనుగ్రహం కలిగి ఈ వ్యాదుల నుండి ఉపశమనం కలుగుతుంది.

 

 courtesy-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here