వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము? | Ganesh Pooja for Marital Problems in Telugu

1
6509

Ganesh Pooja for Marital Problems in Telugu

వైవాహిక జీవితములో ఎదుర్కొనే సమస్యలు సాదరణంగా ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • వివాహము ఆలస్యం అవడము
  • వివాహ అనంతరము సంసార సమస్యలు
  • ఆలుమగల మధ్య గొడవలు

ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ రాయడానికి వీలు ఉన్నవి,లేనివి కూడా చాలా ఉన్నాయి .
అసలు ఆయా సమస్యలు రావడానికి గల కారణం ఏమిటి ?
ఏ గ్రహముల ప్రభాముల వలన ఇటువంటి సమస్యలు వస్తాయి ?
గత జన్మ పాపాలు /శాపాలు వైవాహిక వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయా ?
వంటి వాటంన్నిటికి విడివిడిగా పరిహారములు ఏమిటి వంటివి వివరంగా చెప్పడానికి ప్రస్తుతం సమయం చాలదు కనుక తర్వాత పోస్టులలో వాటి గురించి తెలుసుకుందాము .

ఇక ప్రస్తుతానికి ఈ వినాయక చవితి రోజున ఎలాంటి తంత్ర పరిహారము చేయడము వలన ఉపశమనం లభిస్తుంది అనేది తెలుసుకుందాము .

ప్రధానంగా వైవాహిక జీవితము మీద అంగారక, బృగువు గ్రహముల ప్రభాము బాగా ఉంటుంది .కనుక ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తమున నిద్ర లేచి ఇల్లు మొత్తము కూడ శుచిగా సుబ్రపరుచుకున్న తర్వాత నీటిలో స్వల్పంగా గోముత్రము, కళ్ళు ఉప్పు (raw salt) పసుపు వేసి ఫ్లోరింగ్ ను తుడుచుకోవాలి .
అరటి ఆకు మీద మల్లెపూలు లేదా మంచి వాసన ఉండే తెలుపు రంగులో ఉన్న పూలను (విడి పూలు) చల్లి అందులో విగ్నేశ్వరుడిని ఉంచి గన్నెరుపూల మాలా ను లేదా బంతి పూల మాల, రుద్రాక్ష మాల స్వామి వారికి అలంకరించాలి .

ప్రసాదము :-

కుడుములు, ఉండ్రాళ్ళతో పాటు పంచదార కల్పిన పాలన్నం, గారెలు, పులిహోర, బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిరి ముద్దలు ,ఏదేని ఊరగాయ కలిపిన చిన్న చిన్న 9 అన్నం ముద్దలు
ఈ విదమైన ప్రసాదములతో నైవేధ్యం పెట్టి దూప ,దీపములతో అర్చించి సంకల్పం చెప్పుకున్న పిదప ……గారెలు ,పులిహోర బెల్లం నువ్వులు కలిపి చేసిన చిమ్మిరి ఉండలు ,ఊరగాయ అన్నం వంటి వాటినన్నింటిని ప్రసాదముగా పంచి ఇంట్లో ఉన్న మీ పెద్దలకు పాద నమస్కారము చేసి పూజా అక్షాంతలతో ఆశీర్వాదము తీసుకోవాలి .
తదుపరి మీకు వివాహము అయితే బార్యాభర్తలు ఇద్దరు కలిపి ,కాకపోతే మీరు ఒక్కరూ మాత్రమే ఉండ్రాళ్ళను, కుడుములను, ఉండ్రాళ్ళతో పాటు పంచదార కల్పిన పాలన్నం ను స్వీకరించిన తర్వాత కుటుంబ సబ్యులకు పంచాలి.

అవకాశము ఉన్నవారు ఈ రోజు ఉదయం మందేశ్వర ముహూర్తం లో అనగా గం 07:05 లనుండి 07: 49 ని “ లలోపల నానబెట్టిన నువ్వులు ,కందులు ,ఉలవలు ,మినుములను గోమాత కు మీ స్వహస్తాలతో తినిపించాలి .

తిరిగి వచ్చే సమయములో దేవాలయ దర్శనము చేసుకొని దారిలో బెల్లం ను సేకరించి ఇంటికి వచ్చిన పిదప స్వీకరించాలి. వీలైతే ఈ విదంగా 5 రోజులు చేస్తే చాలా ప్రశస్తము .

తదుపరి పోస్టులో సంతాన సమస్యలు తొలగుటకు పరిహారముల గురించి తెలుసుకుందాము .

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు .
astroguru81@gmail.com
ఒంగోలు
సెల్ : 9246461774

Vinayaka Chaviti Festival Related Posts

గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?

వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న వారు వినాయక చవితి పూజ చేసే విధానం? | Ganesh pooja to Avoid Parenting Problem in Telugu

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

వినాయకుడు – సింహవాహనుడు – ముద్గల పురాణం

అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?

శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here