విధ్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు వినాయకచవితి చేసే విధానం | Ganesh Pooja for Better Education in Telugu

0
4395

ఎంత చదివినా అవసర సమయంలో గుర్తురాక విధ్యా విషయాలలో ఆటంకాలు రావడము వలన ఎంతో విలువైన విధ్యా సంవత్సరాలను కోల్పోతు ఉంటారు, మరి కొందరికి పరీక్షలలో పేపర్లు మిగిలిపోతు ఉంటాయి .

అటువంటి వారు ఈ గణేశ చతుర్ధీ నాడు ఉదయం విగ్నేశ్వరుడికి రుద్రాక్ష మాల ,ఓక చిన్న జెండా లను అలంకరించి , ఉత్తరేణి సమూలములు మరియు ఎరుపు రంగు గులాబీ దళములతో అర్చించి ,కందులు మరియు ఉలవలు ,ఖర్జూరము లతో తయారు చేసిన పిండి వంటలను నైవేధ్యం గా సమర్పించాలి.

తర్వాత విష్ణు ముహూర్త సమయములో అనగా మధ్యాహ్నం గం.12:23 నుండి గం .12:55 ని .ల లోపు ఉదయం స్వామి వారికి సమర్పించిన రుద్రాక్ష మాల ,జెండా లను మరియు ఎరుపు /దుమవర్ణం లో ఉండే కండువ ( టవల్ ) లను తాత ( అమ్మ తండ్రి ) కి లేదా సద్బ్రాఃమనుడికి దక్షిణ తో సమర్పించి ఆశీర్వాదము తీసుకోవాలి .

అలాగే ఇదే సమయంలో ఉదయం స్వామి వారికి సమర్పించిన నైవేధ్యం ను మీరు తినకుండా ప్రసాదంగా పంచాలి.

ఈ ప్రసాదం తిన్న వారికి కూడా శుభం కల్గుతుంది .ఒక వేల ప్రసాదం పంచడానికి సమీపంలో భక్తులు ఎవరు లేకపోతే గోమాత కు తినిపించవచ్చు .

అవకాశం ఉంటే ఈ ఒక్క రోజు మంచం మీద కాకుండా క్రింద (చాప) పడుకోవడానికి ప్రయత్నించండి .
( ఇది అత్యంత రహస్యమైన తాంత్రిక పరిహారము .

తాంత్రిక పరిహారములు చాలా తక్కువకాలంలోనే ఫలితములను ఇవ్వడము గమనించవచ్చు).

తర్వాత పోస్టులో వృత్తి లో ఆటంకములను అధిగ మించడమెలాగా అనే అంశమును గురించి తెలుసుకుందాము .

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ పరిశోధకులు
ఒంగోలు

వృత్తిలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు వినాయక చవితి పూజ చేసే విధానము | Vinayaka Pooja for Job Career Problems in Telugu

వినాయక చవితి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here