
Ganga Saptami in Telugu / గంగా సప్తమి
గంగాదేవి అవతరించిన వైశాఖ శుద్ధ సప్తమిని గంగా సప్తమి అంటారు. భగీరథుని తపస్సుకు మెచ్చి ఆకాశ గంగ శివుని జటాజూటం నుండీ నేలకు దుమికింది.
ఆమె వేగానికి జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. దానితో ఆగ్రహించిన ఆ మహాముని గంగను ఔపోసన పట్టేశాడు(తాగేశాడు).
భగీరథుని ప్రార్థన మేరకు అతని తపస్సుని, జరిగిన వృత్తాంతాన్నీ దృష్టిలో పెట్టుకుని తన చెవినుండీ గంగను విడుదల చేశాడు. ఆరోజుని గంగా సప్తమిగా జరుపుకుంటాము.
జహ్ను మహర్షి నుండీ ఉద్భవించింది కాబట్టి గంగా దేవికి జాహ్నవి అన్న పేరు కూడా ఉంది. గంగా సప్తమి రోజు గంగా స్తోత్రాన్ని చదువుకుని స్నానం చేసినా, కుదరనిపక్షం లో స్తోత్రం చదువుతూ తలమీద నీళ్ళు చల్లుకున్నా మంచి జరుగుతుంది. దీర్ఘకాలిగా రోగాలు ఉపశమిస్తాయి.
గంగాస్తోత్రం
ఈ రోజున వేప చెట్టుకి పూజ చేసి,వేప చివుళ్ళను ప్రసాదంగా స్వీకరించే ఆచారం కొన్ని చోట్ల ఉంది. వైశాఖ శుద్ధ సప్తమిని నింబ సప్తమి అనికూడా అంటారు.