
Gayatri Mantra Chanting Benefits & Significance
1గాయత్రీ మంత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు & ప్రాముఖ్యత
గాయత్రీ మాతను జ్ఞాన దేవతగా కోలుస్తారు. గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజును గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. జ్యైష్ట శుక్ల ఏకాదశి రోజున హిందువులు గాయత్రీ జయంతిని జరుపుకుంటారు.
గాయత్రి మంత్రంలో దేవతా శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఈ మంత్రం మహా శక్తివంతమైన మంత్రాక్షరాలతో కూడి ఉంటుంది. అందుకే గాయత్రిని మించిన దైవం ఎవరు లేరంటారు. ఎవరైతే గాయత్రీ మాతను పూజిస్తారో, హవనాన్ని చేస్తారో, గాయత్రీ మంత్రాన్ని జపిస్తారో వారికి అనేక వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలాన్ని పొందుతారని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా గాయత్రీ మంత్రాన్ని జపిస్తే వచ్చే జన్మలో వైకుంఠ ధామానికి వెళతారని హిందు మత గ్రంథాలలో చెప్పబడింది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.