ఉద్యోగం లో ప్రమోషన్ కోసం సూచన | Get Job Promotion Tips in Telugu

0
5665
download
Get Job Promotion Tips in Telugu

Get Job Promotion Tips in Telugu

ఉద్యోగం లో స్థిరమైన జీవనం కోసం, స్థిరత్వం కోసం, ఉద్యోగం లో అభద్రతా భావం తొలగించుకోవలనుకొనే ప్రతి ఒక్కరు శనీశ్వరుని పూజించాలి.

శనిని ఈ మంత్రం తో జపించాలి

మంత్రం

“ఓం చర స్థిర స్వభవాయ నమః”

ఈ మంత్రాన్ని శనివారం నాడు వీలయినన్ని సార్లు జపించుకోవాలి. అలాగే సంధ్యా సమయంలో నువ్వుల నూనె దీపం రావి చెట్టు వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. దీనితో పాటు హనుమంతుని విగ్రహనికి లేదా చిత్రపటానికి నువ్వుల నూనె , సింధూరం కలిపి పటానికి లేపనం చేయాలి .

శివాలయం లో కాల భైరవ మందిరం లో ఆవ నూనె తో దీపం వెలిగించడం ద్వారా ఉద్యోగం లో స్థిరత్వం వస్తుంది. అలాగే మీ గృహంలో శనివారము నాడు ఒక ఇనుప ప్రమిద లో కొబ్బరి నూనె తో దీపం వెలిగించడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే శనివారము నాడు పచ్చకర్పూరం, కుంకుమ కలిపి ముఖానికి ధరించాలి. అలాగే ప్రదోష సమయంలో రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో ఉన్న పుట్టలలో పాలు, నీళ్లు కలిపి పోయడం ద్వారా ఉద్యోగం లో సంతృప్తి కరమైన స్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది

పరమేశ్వరుడు కూడా ఉద్యోగ ప్రదాత

సోమవారం నాడు ఈశ్వరుని పటానికి పసుపు రంగు పువ్వుల మాల వేసి , గరిక పూలతో స్వామి ని పూజించి తాలింపు పెట్టిన శనగలు ప్రసాదం గా నివేదించాలి

ఈ క్రింది మంత్రాన్ని జపించడం వలన ఈశ్వరుని అనుగ్రహం వలన ఉద్యోగం లో సరియైన స్థితికి రావడం జరుగుతుంది

మంత్రం

” ఓం వృషభ వాహనాయ నమః’ ఈ మంత్రంను వీలయి నన్ని సార్లు జపించాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here