వెన్నునొప్పిని నివారించే భుజంగాసనం | Bhujangasana Benefits in Telugu

0
9982
వెన్నునొప్పి నివారించే భుజంగాసనం
వెన్నునొప్పిని నివారించే భుజంగాసనం | Bhujangasana Benefits in Telugu

వెన్నునొప్పిని నివారించే భుజంగాసనం | Bhujangasana Benefits in Telugu

 

Bhujangasana Benefits in Telugu – భుజంగాసనం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఒత్తిడి కారణంగా లేదా ఎక్కువసేపు కూర్చుని పని చేయడం ద్వారా,మరే ఇతర కారణాల వల్లైనా వెన్నునొప్పి బాధిస్తుంది. వెన్ను పూస పై అధికంగా బరువు పడటం దీనికి ప్రధాన కారణం . భుజంగాసనం వేయడం వల్ల వెన్నుపూస,ఆ ప్రాంతం లోని కండరాలు ఉద్దీపనం అయి తరువాత వెంటనే విశ్రాంతిని పొందుతాయి.

భుజంగాసనం ఎలావేయాలి..?

  • కాళ్ళను,మోకాళ్ళను,ఉదరాన్ని ఛాతీనీ నేలకు ఆన్చి నుదురు నేలకు తాకేలా బోర్లా పడుకోండి.
  • కాళ్ళను దగ్గరగా ఉండేలా చూసుకోండి. అరచేతులను భుజాలకిందుగా నేలకు ఆన్చండి.
  • మెల్లిగా గాలిని పీలుస్తూ అరచేతులను నేలవైపు ఒత్తిడి చేస్తూ తలను, ఛాతీభాగాన్ని,పైపొట్టనూ పైకి లేపండి. పొత్తికడుపు నేలను తాకే ఉండేలా చూసుకోండి.
  • మెల్లిగా ఐదు సార్లు ఊపిరి పీల్చి వదులుతూ ఆ భంగిమలో ఉండాలి.
  • తిరిగి నిదానంగా మామూలు స్థితికి రావాలి.
  • సరైన భంగిమ కోసం పైన ఉన్న పటాన్ని చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here