వివరాలు గ్రీన్ టీ ఔషధ గుణాలు కలిగిన
నోటి క్యాన్సర్‌ను,హార్ట్ సమస్యలు దూరం చేసే గ్రీన్ టీ
ఔషధ గుణాలు కలిగిన గ్రీన్ టీను ప్రతి రోజూ సేవించడం వల్ల నోటి దుర్వాసనతో పాటు.. నోటి క్యాన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంకా శ్వాసప్రక్రియను కూడా మెరుగ్గా ఉంటుందని తెలిపింది.
అలాగే గ్రీన్ టీని సేవించడం ద్వారా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చని ఇజ్రాయేల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.
గ్రీన్ టీలో ఉండే ఫాలిఫినాల్స్ అనే యాంటియోయాక్సిడెంట్లు నోటి క్యాన్సర్‌కు,
నోటి దుర్వాసనకు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుందని,అంతేకాకుండా నోటిలోని దంతాలు పుచ్చికోకుండా ఉండేందుకు కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ధూమపానం వల్ల నోటిలో చేరే క్రిములను కూడా గ్రీన్ టీ నిర్మూలిస్తుందని చెప్పారు. వీటితో పాటు.. నోటి క్యాన్సర్‌తో పాటు హృద్రోగ సమస్యలు, పార్కిన్సన్స్, అల్జీమర్ వంటి వ్యాధులను నివారించేందుకు కూడా గ్రీన్ టీ ఓ మంచి ఉత్ప్రేరకంగా పని చేస్తుందని చెప్పారు.
Very Nice
super