
మహిమాన్వితమైన మహాలక్ష్మీ ఆలయం | Glorious Mahalakshmi Temple
తమిళనాడు కు 180 కిలోమీటర్ల దూరం లో వేలూరు దగ్గర్లోని మలైకుడి పరిసర కొండ ప్రాంతంలో గల శ్రీపురం లో 100 ఎకరాల విస్తీర్ణం గల మహాలక్ష్మీ ఆలయం ఉంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంగా పేరు గాంచిన ఈ ఆలయానికి మూడు వైపులా కోనేరు, నాలుగోవైపు సింహద్వారం ఉంటాయి. గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది. అమ్మవారి గుడి నక్షత్రాకారం లో శ్రీ చక్రాన్ని పోలి ఉంటుంది. చాలా హిందూ దేవాలయాలలో సాధారణంగా పాటించే ఆగమ శాస్త్ర ప్రకారం కాకుండా శ్రీవిద్యా విధానం లో ఇక్కడ అమ్మవారికి పూజాదికాలు జరుగుతాయి. ఈ ఆలయ నిర్మాణానికి నారాయణి అమ్మ అనే స్వామి నేతృత్వం వహించాడు. ఆయనను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు.
అన్ని మతాలకు చెందిన పవిత్ర వాక్యాలు, శ్లోకాలు ఇక్కడి దారిపొడవునా కనిపిస్తాయి. మరే ఇతర హిందూ దేవాలయం లోనూ ఇది కనిపించదు.