
ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా, శక్తిగా పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం.
మనం దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నామో, మన మనుగడ దేనివలనైతే జరుగుతున్నదో అటువంటి శక్తిని గౌరవించడం కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించడం మన కర్తవ్యం.
ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ఆచరించి చూపించాడు. ఆ కథను తెలుసుకుందాం.
1. నందవ్రజం లో ఇంద్రయాగం
నందవ్రజం లో ప్రజలు ప్రతియేటా ఇంద్రయాగము చేసేవారు. శ్రీ కృష్ణ ప్రమాత్మునికి ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి నందుడు ఇంద్రయాగాన్ని తలపెట్టాడు.
ఆ యాగ సదస్సులో శ్రీ కృష్ణుడు నందుని ‘ తండ్రీ మనం ఎందుకు ఈ యాగాన్ని చేస్తున్నాం’ అని అడిగాడు. అప్పుడు నందుడు ‘కృష్ణా..! యజ్ఞయాగాదులు దేవతలకు కృతజ్ఞతగా, లోకహితార్థం జరుపుతాము.’ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నందాదులకు ఒక ధర్మోపదేశం చేశాడు.
Promoted Content