
ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా, శక్తిగా పూజించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం.
మనం దేని మీదైతే ఆధారపడి జీవిస్తున్నామో, మన మనుగడ దేనివలనైతే జరుగుతున్నదో అటువంటి శక్తిని గౌరవించడం కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించడం మన కర్తవ్యం.
ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడే ఆచరించి చూపించాడు. ఆ కథను తెలుసుకుందాం.
2. శ్రీకృష్ణుని ధర్మోపదేశం
‘తండ్రీ..! దేవతలకు కృతజ్ఞతలు తెలిపినంత మాత్రమున పుణ్యఫలం లభించదు. ఫలసిద్ధికి ముఖ్యమైన హేతువు కర్మ.
ఒకమనిషి తాను ఎన్ని సత్కార్యాలు చేశాడన్నదాన్ని బట్టి అతని పుణ్య ఫలం ఆధారపడి ఉంటుంది. స్వధర్మాన్ని ఆచరించడానికి మించిన పుణ్యకార్యం లేదు.
సర్వవ్యాపకుడైన పరమాత్ముడు ప్రకృతిలో నిండి ఉన్నాడు. మనకు ఎల్లవేళలా సహకరించి, జీవితాన్ని ప్రసాదించే ప్రకృతిని పూజించడం నిజమైన కృతజ్ఞత.
మనం గోపాలకులం మనకు నీడనిచ్చి, మన పశువులకు గ్రాసాన్నిస్తున్న ఈ గోవర్ధన గిరిని తప్పక పూజించాలి. ఈ గోవర్ధనగిరి గోవిందుని వక్షస్థలం నుండీ పుట్టినది.
పౌలస్త్య మహాముని అనుగ్రహము చేత ఇక్కడకు వచ్చింది.’ అని నందునితో అన్నాడు. శ్రీ కృష్ణుని మాటలను విన్న నందుడు సంతోషంగా గోవర్ధన గిరిని పూజించడానికి అంగీకరించాడు.
కృష్ణా..! నీవు సర్వోత్తముడవు, కారణ జన్ముడవు గోవర్ధన గిరిని ఎలా పూజించాలో నీవే తెలుపుము అన్నాడు.