1. అపరాజితా దేవి
అపరాజితాదేవి శక్తి రూపాలలో ఒకటి. అపరాజిత అంటే ఓడించడానికి అసాధ్యమైనది అని. అపరాజితాదేవి దేవ దానవ యుద్ధం లో సైన్యాధికారిణి. మహిషాసుర మర్దిని స్వరూపమైన ఆమెను పూజించినవారు సర్వత్రా విజయాలను పొందుతారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి ముందు, పాండవులు కురుక్షేత్ర సంగ్రామ విజయం కొరకు అపరాజితా దేవిని పూజించారు. ఆమె శమీ వృక్షం(జమ్మి చెట్టు) లో ఉంటుందని భక్తుల విశ్వాసం.