మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 

0
29

మార్గశిర మాసంలో గురువారం మార్గశిర లక్ష్మివార వ్రతం , వ్రత విధానం – సమర్పించవలసిన నైవేద్యములు – వ్రత కథ

శ్రేష్ఠకరమైన, పవిత్రమైన మార్గశిర మాసంలో స్త్రీలకు ముఖ్యమైన లక్ష్మీవారం నోములు ఎంతో శుభాన్ని కలిగిస్తాయి. ఈ లక్ష్మీవారం నోములను మార్గశిర లక్ష్మీవారవ్రతం అని అంటారు.

Back

1. మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం:

ఈ మాసంలో వచ్చే లక్ష్మీ వారం నాడు స్త్రీలు తెల్లవారుఝామునే లేచి శుచిగా స్నానం చేసి దేవుడి గదిని అలికి ముగ్గులు పెట్టుకోవాలి. మహాలక్ష్మిని షోడశోపచారాలతో పూజించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. కథ చెప్పుకుని పెద్దల ఆశీర్వాదం పొందాలి. 

  • మొదటి లక్ష్మీవారంనాడు పులగం, 
  • రెండవ వారం పరమాన్నం, 
  • మూడవ వారం అట్లు, 
  • నాలుగవ వారం గారెలు నివేదన చేయాలి. 

వారి వంశాచారాన్ననుసరించి కొన్ని మార్పులు ఉండవచ్చు. పుష్యమాసం వచ్చాక మొదటి లక్ష్మీవారం పూర్ణం బూరెలు, పులిహోర లక్ష్మీదేవికి సమర్పించాలి. ఆ వారంతో వ్రతం పూర్తవుతుంది. పుష్యమాసంలో మొదటి వారం కుదరకపోతే ఏదో ఒక వారం చేసుకోవచ్చు. 

Promoted Content
Back