విజయాలను అందించే అపరాజితా దేవి..! | Goddess of Victory Aparajitha Devi in Telugu

0
16227
విజయాలను అందించే అపరాజితా దేవి..! | Goddess-of Victory Aparajitha Devi in Telugu
Goddess-of Victory Aparajitha Devi in Telugu

విజయాలను సాధించాలని ఎవరు కోరుకోరు..? కానీ మానవ ప్రయత్నం తో అన్నీ సార్లూ అది సాధ్య పడక పోవచ్చు. ప్రతి సారీ తల పెట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందాలంటే దైవానుగ్రహం తప్పనిసరిగా కావాలి. అపరాజితా దేవి ని పూజించడం ద్వారా విజయం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందనడం లో సందేహం లేదు.

Back

1. అపరాజితా దేవి ఎవరు?

దుర్గాదేవి అనేక అంశలలో అపరాజితా దేవి అవతారం ఒకటి. అపరాజిత అంటే ఎవరిచేతా ఓడింపబడనిది అని అర్థం. దుర్మార్గులను శిక్షించి ధర్మ మార్గం లో నడిచేవారిని అమ్మ ఎల్లప్పుడూ కాపాడుతుంది. భూమండలం పై అధర్మం ప్రజ్వరిల్లినపుడు దేవతలందరి సహకారంతో దుర్గా దేవి అంశతో అపరాజితా దేవి ఉద్భవించింది. ఆమె అష్టదళ పద్మం పై అధిష్టించి మహా శివుని ఆజ్ఞ తో జయాన్ని కూర్చే ఎనిమిది శక్తి రూపాలను ఆదేశిస్తుంది. వారు ఆమ్మను కొలిచిన వారికి సర్వదా విజయం కలిగేలా పరిస్థితులను శాసిస్తారు. కొన్ని రూపాలలో అపరాజితా దేవి సింహ వాహనం పై అనేక బాహువులతో ఆయుధాలను ధరించి ఉంటుంది. దేవీ పురాణం లోనూ చండీ సప్త శతి లోనూ అమ్మవారి గురించిన వర్ణనలు ఉంటాయి. అమ్మవారు శక్తి కేంద్రకమైన శమీ వృక్షం( జమ్మి చెట్టు) పైన నివశిస్తుందని శాస్త్రోక్తం. అందుకే విజయ దశమి రోజున అమ్మ వారు నివసించే శమీ వృక్షానికి పూజలు చేస్తారు. తంత్ర శాస్త్రం లో అపరాజితా దేవి చాలా ముఖ్యమైన దేవత గా చెప్పబడింది. ఉత్తర హిందూ దేశం లోని ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలలో అమ్మవారి ఆలయాలు దర్శనమిస్తాయి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here