శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అలంకరణ | Dasara third day Goddess in Telugu

0
15408
శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అలంకరణ | Gayatri Devi Dasara Alankarana in Telugu

Dasara third day Goddess in Telugu

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

4. శ్రీ గాయత్రి దేవి అమ్మవారు

28/09/2022 – బుధవారం

ఆశ్వయుజ శుద్ధ తదియ (వృద్ది)

మూడవ రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకరణ (కుజుడు + కేతువు)

గులాబిచీర (శుక్రుడు)

పాలతో నైవేద్యం(చంద్రుడు)

గుడాన్నం ( శనీశ్వరుడు + బృహస్పతి )
(చెక్కెర పొంగలిలో పంచదారకు బదులుగా బెల్లం )

అల్లం తో తయారు చేసిన గారెలు ( రాహువు +కుజుడు + శనీశ్వరుడు)

3. ఎవరు చేయాలి ?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ?

ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే

Muktha vidruma hemaneela dhavalachhaayai rmukhai sthree ksha nai
ryuktha mimdu nibaddarathna makutaam thathvardha varnaathmikaam
gaayathreem varadaabhayaamkusakasaassubhram kapaalam gadaam
samkham chakramadhaara vimda yugalam hasthairvaham theem bhaje

మూడవరోజు అమ్మవారికి శ్రీ గాయత్రి దేవి అలంకరణ చేసి గులాబి రంగు చీరను సమర్పించి పాలు, గుడాన్నం, (చెక్కెర పొంగలిలో పంచదారకు బదులుగా బెల్లం) అల్లం తో తయారు చేసిన గారెలు నైవేధ్యంగా నివేదన చేయడము ద్వారా అన్నీ మంత్రములకు మూల శక్తి అయిన అమ్మవారి అనుగ్రహం లభించి మంచి వాక్చుద్ధి ని పొందడము జరుగుతుంది.

  • ఎంతో కాలం నుండి పీడిస్తున్న ఋణ సమస్యల నుండి విముక్తి /ఉపశమనం లభిస్తుంది.
  • వాహన గండములు తొలగిపోతాయి.
  • శత్రువుల పీడ తొలగుతుంది.
  • తలపెట్టిన /చేయు పనుల విషయంలో ఆశించిన వ్యక్తుల సహకారము లభిస్తుంది.
  • వృత్తి యందు అభివృద్ది కల్గుతుంది.
  • విదేశీ వ్యవహారములందు ఆటంకాలు తొలగిపోతాయి.
  • అపమృత్యు దోషం తొలగిపోతుంది.
  • దృష్టి ధోషాలు తొలగి అన్నింటా శుభం కల్గుతుంది.
  • పురుషులకు పుంషత్వ దోషాలు నుండి ఉపశమనం కల్గుతుంది.
  • స్త్రీలకు భర్త వలన కల్గు భాధల నుండి విముక్తి లభిస్తుంది.
  • స్త్రీ, పురుషులకు ఎముకలు, కండరాలు, రక్తానికి సంభందించిన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కల్గుతుంది.

గమనిక : ఈ అమ్మవారిని పూజించు సమయంలో ఎరుపు లేదా నలుపు ,బులుగు రంగు బట్టలను దరించరాదు .( ప్రస్తుత సమయంలో మాత్రమే)

2. పటించవలసిన మంత్రము

ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్

omm bhurbhu vassvaha
thatsha vithurva renyam
bhargo devasya dheemahi
dhiyoo yoonaha pracho dayaaath

ఈ మంత్రమును స్వర బద్దంగా ఒకటికి నాల్గు పర్యాయములు విని తర్వాత పైకి వినపడే విధముగా కనీసము 1008 పర్యాయములు లేదా అంతకు మించి పఠించవలెను. ఇది చాలా విశిష్టమైన మంత్రము అవకాశమున్న వారు ఈ క్రింది మంత్రములను కూడా జపించవచ్చును.

1. ఈ క్రింది ఒక్కో మంత్రమునకు ఒక్కో అద్భుతమైన ఫలితము ఉంటుంది.

అగ్ని గాయత్రి – ఓమ్ మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.

ఇంద్ర గాయత్రి – ఓమ్ సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.

కామ గాయత్రి – ఓమ్ కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోऽనంగః ప్రచోదయాత్.

కృష్ణ గాయత్రి – ఓమ్ దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.

గణేశ గాయత్రి – ఓమ్ ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

గురు గాయత్రి – ఓమ్ సురాచార్యాయ విద్మహే వాచస్పత్యాయ ధీమహి, తన్నోగురుః ప్రచోదయాత్.

చంద్ర గాయత్రి – ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

తులసీ గాయత్రి – ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.

దుర్గా గాయత్రి – ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.

నారాయణ గాయత్రి – ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.

నృసింహ గాయత్రి – ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.

పృథ్వీ గాయత్రి – ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.

బ్రహ్మ గాయత్రి – ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.

యమ గాయత్రి – ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.

రాధా గాయత్రి – ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.

రామ గాయత్రి – ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.

లక్ష్మీ గాయత్రి – ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

వరుణ గాయత్రి – ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.

విష్ణు గాయత్రి – ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.

శని గాయత్రి – ఓమ్ కాక ధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి, తన్నో మందః ప్రచోదయాత్.

శివ గాయత్రి – ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్

సరస్వతీ గాయత్రి – ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.

సీతా గాయత్రి – ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.

సూర్య గాయత్రి – ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.

హనుమద్గాయత్రి – ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.

హయగ్రీవ గాయత్రి – ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.

హంస గాయత్రి – ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.

శ్రీ అయ్యప్ప గాయత్రి – ఓం భూకనాథాయ విద్మహే భావపుత్రాయ ధీమహి, తన్నోషష్టా ప్రచోదయాత్.

శ్రీ శ్రీనివాస (వేంకటేశ్వర) గాయత్రి – ఓం నిరంజనాయ విద్మహే నిరాధారాయ ధీమహి, తన్నోవేంకట ప్రచోదయాత్.

శ్రీ కార్తికేయ (షణ్ముఖ) గాయత్రి – ఓం తత్ పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి, తన్నోషణ్ముఖ ప్రచోదయాత్.

శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారు (అలంకరణ) | Dussehra Fourth day

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here