1. శ్రీ రాముని రాకకై ఇప్పటికీ ఎదురు చూస్తున్న దేవి ఎవరు?
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మాహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల అంశతో త్రిశక్తి స్వరూపిణిగా వైష్ణవి అనే బాలిక జన్మించింది. ఆమె జ్ఞాన తృష్ణను ఈ భూమండలంపై ఏ గురువూ తీర్చలేక పోయాడు. మహా శక్తి రూపమైన వైష్ణవి ధ్యానం లో మునిగి అనేక విషయాలను స్వయంగా నేర్చుకుంది. శ్రీరామ చంద్రుడు అరణ్యవాసం లో ఈమెను కలుసుకుంటాడు. అప్పుడామే రాముడే విష్ణుమూర్తి రూపమని గ్రహించి తనను ఆయనలో లీనం చేసుకొమ్మని ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీరాముడు తాను అరణ్య వాసం నుంచీ ఒచ్చిన తర్వాత తిరిగి కలుసుకుంటాననీ అప్పుడు ఆమె రాముని గుర్తు పడితే ఆమె కోరికను నెరవేరుస్తానని ప్రమాణం చేసి వెళ్తాడు. రామచంద్రుడు అరణ్యవాసం ముగించుకుని ఒక వృద్ధుని వేషం లో వైష్ణవికి కనిపిస్తాడు. అప్పుడామే రాముని గుర్తుపట్టలేక పోతుంది. ఆ కారణం చేత శ్రీ రాముడు ఆమెను కలియుగం లో తాను కల్కి రూపమై చేరుకుంటాననీ అప్పటివరకూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ త్రికూట పర్వత సానువు లలో తపస్సునాచరించమని ఆదేశిస్తాడు.