లక్ష్మీదేవి అనుగ్రహానికి | How to Get Lakshmi Devi Blessings in Telugu

0
26190
lakshmi devi anugraham
లక్ష్మీదేవి అనుగ్రహానికి | How to Get Lakshmi Devi Blessings in Telugu

1. మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు, బయట లోపల లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. అలా ఉంచిన మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.
2. లక్ష్మి దేవికి 7 శుక్రవారాలు, 7 ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి చేకూర్చుతుంది.
3. ప్రతినెలా వచ్చే అమావాస్య నాడు ఇంటి అంతటిని శుభ్రపరచండి.
4. మీ ఇంటిలో ఉండే దేవుని మందిరంలో, ఒక మంచి రోజు, ఒక కుంకుమ భరిణలో “గోమతి చక్రం” అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.
గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .
5. సాయంత్రం , ఉదయం లైటు వేసిన తరువాత ఇల్లు చిమ్మరాదు .
6. మూత లేకుండా “డస్ట్ బిన్” ఉండకూడదు, పగిలిన అద్దము ఇంటిలో ఉండకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here