
Good News for the Tirumala Shrivari Devotees By TTD
1శ్రీవారి నడక దారి భక్తులకు శుభవార్త
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మెట్లు ఎక్కుతూ వచ్చె భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నడక దారిలో మెట్లు ఎక్కుతూ వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇవ్వనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారు ఒక ప్రకటనలో వెల్లడించారు. టీటీడీ సంభందించిన ఆస్తులపైన కూడ పూర్తి వివరాలతో ప్రకటిస్తాము అని చెప్పారు. అదే విదంగా టీటీడీ బడ్జెట్ వివరాలు కూడ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత వెల్లడిస్తాము అని చెప్పారు.
శ్రీ వాణి భక్తుల కోసం తిరుమలలోని ఏటీజీహెచ్, ఎస్ఎన్జీహెచ్ అతిధి గృహల్లోని 88 గదులను కేటాయిస్తామని, కాషన్ డిపాజిట్ విధానంపై పూర్తి స్తాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ నెల నుండి తిరుమల కొండ పైన ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.