
Gooseberry Health Benfits in Telugu.
ఉసిరిక పండు ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక ఉసిరికాయ తీనె వారికీ ఆరోగ్య రిత్య ఏంటో మేలు చేస్తుంది
ఉసిరిక పండ్లతో చేసిన అత్యంత బలకరమైన, ప్రాచుర్యమైన మందు చ్యవనప్రాశావ లేహ్యం.
మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును.
ఈ రెండు కలిసిన మందు ‘నిశాఅమలకి’ టాబ్లెట్ గా మందుల షాపులలో లభ్యమగు చున్నది.
ఉసిరి కాయలలో విటమిన్ ‘సీ’ అధికముగా వున్నది. దీన్ని తిన్నందు వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగును.
శరీరానికి చల్లదనాన్నిచ్చి మల మూత్ర విసర్జన సక్రమముగా జరుగును. చక్కెర వ్వాది గ్రస్తులు దీనిని వాడినందున ఇంసులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలోని చెక్కెరను తగ్గించును.
జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడుతారు. అదే విదంగా కురుల ఆరోగ్యానికి కూడు ఉసిరి కాయలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
పుల్లని రుచి ఉండే ఉసిరిని తినటం వలన జీర్ణవ్యవస్థలోని రిసెప్టార్’లను ఉత్తేజ పరచి, జీర్ణక్రియ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది.
అధిక మొత్తంలో ఫైబర్’లను కలిగి ఉండటం వలన జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. పేగు కదలికలను మెరుగుపరచటమే కాకుండా జీర్ణక్రియ అవయవాలను శుభ్రపరుస్తుంది
ఒక స్పూన్ ఉసిరి రసం, అర టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కంటి లోపాలుండవు. కండరాలు బలపడతాయి.
ఉసిరి రసంతో పాటు కాకర కాయ రసం చేర్చి తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఒక స్పూన్ ఉసిరి పొడి, ఒక స్పూన్ నేరేడు పొడి, ఒక స్పూన్ కాకర కాయ పొడి చేర్చి తీసుకుంటే మధుమేహ వ్యాధిని నయం చేసుకోవచ్చు.
ఎండిపోయిన ఉసిరికాయను బెల్లంతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రెండు ఉసిరికాయలను నీటిలో నానబెట్టి ఆ నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవచ్చు.
ఇలా చేస్తే కళ్లు ఎర్రబడటం, దృష్టి లోపాలు వుండవు. అలాగే ఉసిరికాయ గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని వాటిని కొబ్బరి నూనెలో బాగా మరిగించి, తర్వాత ఆరనిచ్చి..
మాడుకు పట్టిస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. ఉసిరికాయ తీసుకోవడం ద్వారా అనారోగ్యాలను ముందుగానే నియంత్రించుకోవచ్చు. ఇకపోతే..
ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి. ఆరెంజ్ పండు కంటే ఉసిరిలో 20 రెట్లు విటమిన్ సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆమ్లా(ఉసిరి)జ్యూస్ మీ చర్మానికి అద్భుతంగా పనిచేసి, మిమ్మల్ని యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఆమ్లా(ఉసిరి)జ్యూస్ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి.
అందువల్లే ఇది ప్రీమెచ్యుర్ ఏజింగ్, ముడుతలు, మరియు ఫైన్ లైన్స్ ను నివారిస్తుంది .