
Greatness Of Charity
చాలా మంది దోషాలను నివారించుకోడానికి, భగవంతుని కృపను పొందటం కోసం దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారిని లోకం ధనవంతులుగా గుర్తిస్తుందే గానీ గొప్ప వాళ్ళుగా కాదు.
కానీ తమ కోసం దాచుకున్నది కూడా పరులు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చివేసే వాళ్ళు మహాత్ములు. భగవంతుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు.
దానం చేయగలగడం ఎంతో గొప్ప లక్షణం. దాన గుణం ఉన్నచోట భగవంతుడు ప్రత్యక్షమవుతాడని నిరూపించే కథ తెలుసుకుందాం.
1. రంతి దేవుడు (Ranthi Devudu)
ఈ కథ భాగవతం లోనిది. పూర్వం రంతిదేవుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన దానగుణానికి నిలువెత్తు రూపం వంటివాడు.
ఆయన తన ధనాన్ని మొత్తం దానం చేసి నిరుపేదయై మిగిలాడు. నలభై ఎనిమిది రోజులు తన కుటుంబం తో సహా అన్నం నీళ్ళు లేకుండా అలమటించాల్సివచ్చింది.
అప్పటికీ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ఒకనాడు ఉదయాన అతనికి నెయ్యి, పాయసము, అన్నము, నీళ్ళు దొరికాయి. అంతటి ఆకలితో అలమటించినా రంతిదేవుడు వేళకాని వేళ, భగవంతుని పూజించకుండా భోజనం చేయలేదు.
భోజన సమయం రాగానే రంతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి కూర్చున్నాడు. కానీ ఆరోజు వారెవరూ భోజనం చేయలేదు.