
Greatness Of Charity
చాలా మంది దోషాలను నివారించుకోడానికి, భగవంతుని కృపను పొందటం కోసం దాన ధర్మాలను చేస్తూ ఉంటారు. వారిని లోకం ధనవంతులుగా గుర్తిస్తుందే గానీ గొప్ప వాళ్ళుగా కాదు.
కానీ తమ కోసం దాచుకున్నది కూడా పరులు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చివేసే వాళ్ళు మహాత్ములు. భగవంతుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాడు.
దానం చేయగలగడం ఎంతో గొప్ప లక్షణం. దాన గుణం ఉన్నచోట భగవంతుడు ప్రత్యక్షమవుతాడని నిరూపించే కథ తెలుసుకుందాం.
2. భోజనం దొరికినా వారు ఎందుకు తినలేకపోయారు?
వారు భోజనానికి ఉపక్రమించే సమయంలో ఒక దీనుడైన బ్రాహ్మణుడు ఆకలంటూ అతని ముందుకు వచ్చాడు. వచ్చిన అతిథిని భగవంతునిగా భావించిన రంతిదేవుడు తమ భోజనం లోని సగభాగాన్ని అతనికి పెట్టి సంతృప్తిపరచాడు.
మిగిలిన భోజనాన్ని తినబోతూ ఉండగా ఒక బాటసారి అన్నం పెట్టమని అడిగాడు. అతనికి ఆహారంలో ఒక భాగాన్ని పెట్టాడు రంతి దేవుడు.
అతను వెళ్ళగానే కుక్కల గుంపుతో ఒకడు వచ్చి తానూ, తన కుక్కలూ ఎంతో ఆకలితో ఉన్నామనీ, ఏదైనా ఆహారం ఇవ్వమనీ అడిగాడు. రంతిదేవుడు తన వద్ద మిగిలిన ఆహారమంతా అతనికి ఇచ్చివేశాడు.
దాహంతో రంతి దేవుని ప్రాణాలు కడబట్ట సాగాయి. అతని వద్ద నీరు ఒక్కరికి మాత్రమే సరిపోయే విధంగా ఉన్నాయి.
వాటిని తాగబోతుండగా మరొక వ్యక్తి వచ్చి ‘స్వామీ దాహం తో అడుగు ముందుకు వేయలేకున్నాను. ఒక గుక్కెడు నీళ్లిప్పించండి.’ అని వేడుకున్నాడు.
తనకు మిగిలిన ఆ నీటిని కూడా రంతిదేవుడు అతని దాహం తీర్చడానికి ఉపయోగించాడు. ‘ మహానుభావా..
నీ ఆకలి తీర్చడానికి నావద్ద ఏమి లేదు. కానీ కొంత నీరున్నది. దయచేసి స్వీకరించండి. ఆపద కలిగిన వారికి సహాయపడటం కన్నా మానవ జన్మకు మరో అర్థం ఏమున్నది?’ అని ఆ నీటిని అతనికిచ్చాడు.