స్థూలకాయం వల్ల, లేదా అనేక ఇతర కారణాలవల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. గుండెజబ్బులకు రక్షణనిచ్చే ఒక అద్భుతమైన చెట్టును గురించి తెలుసుకుందాం.
తెల్ల మద్ది చెట్టును ‘అర్జున వృక్షం’ అనీ, ‘గుండెకు రక్షకుడు’ అనీ అంటారు. టర్మినేలియా అర్జునా అని ఈ చెట్టు శాస్త్రీయ నామం.
ఈ చెట్టును గురించి క్రీ.పూ. 7 వ శతాబ్దానికి చెందిన వాగ్భటుడనే వైద్యుడు ప్రస్తావించాడు. ఈ చెట్టు బెరడుపాలను కషాయం చేసి వాడటం వలన హృద్రోగాలు తొలగుతాయని అష్టాంగ హృదయమనే గ్రంథం లో చెప్పబడింది.
అర్జునుడు ఏవిధంగా అయితే సమర్థ వంతంగా శత్రువులనుండీ రక్షిస్తాడో అలాగే ఈ వృక్షం కూడా సమర్థవంతంగా గుండె జబ్బులనుండీ రక్షిస్తుంది. అందుకనే ఈ చెట్టుకి అర్జున వృక్షమని పేరు.
అంతేకాదు పైపూతగా వాడటం వలన చర్మ రోగాలు, పుండ్లు నయమవుతాయి. నదులు ప్రవహించే ప్రాంతాలలో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి.