గురు గ్రహ దోషనివారణకు మార్గం | Guru Graha Dosha Nivarana in Telugu

1
20273
SriPada_Sri_vallabha
Guru Graha Dosha Nivarana in Telugu

గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయుట వలన దోషనివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఏదో ఒక దానిని దానము చేయుటవలన కూడా గురునకు సంభంధించిన దోషము శాంతింఛ గలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి,ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానము చేసినను గురువునకు సంభంధించిన దోషము తొలగిపోవును. బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము.

శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40 రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును.

పసుపు రంగు స్టోన్ నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును.పసుపు కొమ్ము గణపతిని,పసుపు రంగు స్టోన్ గణపతిని పూజిస్తే చాలా మంచిది.పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు దత్తాత్రేయ స్వామి ని పూజిస్తున్నారు

గ్రహశాంతికి చేయవలసినది.

 1. రత్నము:- పుష్యరాగము.
 2. రుద్రాక్ష:- పంచముఖి
 3. దానము చేయవలసిన ద్రవ్యములు: పసుపు వర్న వస్త్రములు, పసుపు, బంగారము.
 4. గ్రహాసనము:- దీర్ఘచతురస్రము.
 5. గ్రహ సంఖ్య:- 3.
 6. గ్రహదృష్టి:- 5,7,9.
 7. వారము:- గురువారము.
 8. గ్రహబల ఫలితము :- సమాజములో గౌరవము, ధనలాభము.
 9. గ్రహ బలహీన ఫలితము:- ధననష్టము, పరువు నష్టము.
 10. తండ్రి :- అంగీరసుడు.
 11. తల్లి:- సురూప.
 12. భ్రార్య:- తార.
 13. చంధస్సు:- త్రిష్తుఫ్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here