
పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu
ప్రాచీన కాలం లో మన దేశం లో గురుకుల వ్యవస్థ ఉండేది. పంజరపు చిలుకల్లాగా బట్టీ పాఠాలు నేర్చునే ఇప్పటి అనారోగ్యకరమైన విద్యావిధానాలు ఏర్పడకముందు జ్ఞానం స్వేచ్ఛనుండీ లభించేది.
సేవ,ప్రేమ,కృతజ్ఞత,పెద్దలపట్ల గౌరవం, మంచి నడవడిక, స్వంతంగా ఆలోచించగలిగే పరిపక్వత అన్నీ గురుకులం లో విద్యార్థులు సహజంగా నేర్చుకునేవారు.
వేలకు వేలు డబ్బులు గుంజే ఇప్పటి విద్యా సంస్థల్లా కాకుండా ఒకప్పుడు చదువు ఉచితంగా చెప్పేవారు. విద్యాభ్యాసం ముగిశాక విద్యార్థులు తమ శక్తి కొద్దీ గురుదక్షిణ సమర్పించుకునే వారు.
ఆ కాలం లో సత్ప్రవర్తనకు, మాట నిలబెట్టుకోవడానికి ఉన్న ప్రాధాన్యత తెలిపేదే ఈ కథ.
1. పేద విద్యార్థి కౌత్సుడు
ఈ కథ కాళిదాస మహాకవి రచించిన రఘువంశం లోనిది. పూర్వం సూర్యవంశం లో రఘు మహారాజు ఉండేవాడు. ఆయన శ్రీరామ చంద్రునికి పూర్వీకుడు.
ఆ రఘుమహారాజు రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఆయన రాజ్యం లో ఎన్నో గురుకుల పాఠశాలలు ఉండేవి. అందులో వేలమంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు.
అటువంటి గురుకులాలలో వరతంతుడు అనే ముని యొక్క గురుకులం కూడా ఒకటి. అక్కడ కౌత్సుడు అనే ఒక విద్యార్థి ఉండేవాడు.
అతను తన విద్యాభ్యాసాన్ని ముగించుకుని గురువు వద్ద సెలవు కోరాడు. గురువుగారు అతనిని ఆశీర్వదించి ‘నాయనా..! నీవు మంచి విద్యార్థివి.
సత్ప్రవర్తనతో మెలగి మమ్మల్ని సంతృప్తి పరచావు. నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి నీ బాధ్యతలను నెరవేర్చు. చదువుని, సంస్కారాన్నీ ఎన్నటికీ వీడకు. వెళ్ళిరా కౌత్సుకా’ అని సెలవిచ్చాడు.
అప్పుడు కౌత్సుడు గురువుగారిని గురుదక్షిణ అడగవలసిందిగా ప్రార్థించాడు.
Comment: valaki entha avasaramo an the tesukunnaru, they are good.