హనుమంతుడి ఒంటి నిండా సింధూరం ఎందుకు ఉంటుంది?

0
977

సింధూరం అంటే మనం పెట్టుకునే కుంకుమ. హనుమంతుడు సింధూర ప్రియుడు కావడం వెనుక కథను ‘పరాశరసంహిత’ వర్ణించింది. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రామయ్యకు చాలా ఇష్టమని చెప్పింది. దీంతో వెంటనే హనుమంతుడు సింధూరాన్ని ఒంటినిండా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండటం చేత ఆ సింధూరం వెంటనే రాలిపోయేది. దీంతో ఆయన నూనెతో కలిపిన గంగ సింధూరాన్ని ఒంటినిండా పట్టించుకున్నాడట. ఈ అమాయకపు పని చేసిన ఆంజనేయుడ్ని చూసిన శ్రీరాముడు ‘ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడను’ అని అన్నాడట. అటువంటి భక్తులకు సమస్త దోషాలూ తొల‌గి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చాడు. అందుకే హనుమంతుడి ఒంటి నిండా సింధూరం పూసి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here