తెలుగువారి హనుమజ్జయంతి – ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి? | Hanuman Jayanthi in Telugu

1
10709
hanuman jayanthi
Hanuman Jayanthi in Telugu

తెలుగువారి హనుమజ్జయంతి

Hanuman Jayanthi in Telugu – చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి. చైత్ర పూర్ణిమ నుండీ 41 రోజులవరకూ ఆంజనేయుని దీక్షను చేసి, తెలుగువారు ఆఖరి రోజునాడు మళ్ళీ హనుమజ్జయంతి జరుపుతారు. ఈ 41 రోజులూ తెలుగువారు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. ఆంజనేయుని భక్తులు ఆయన దీక్షను భక్తి శ్రద్ధలతో అవలంబిస్తారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి, వైభవంగా స్వామికి పూజలు నిర్వహిస్తారు. ఉయ్యూరు లోని సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు అంగరంగ వైభవంగా సువర్చలా ఆంజనేయుల వివాహ మహోత్సవం జరుగుతుంది.

హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకోడానికి మరో బలమైన కారణం ఉంది. కలౌ పరాశర స్మృతిః అని శాస్త్రం కనుక పరాశర స్మృతి లో

శ్లో : వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
      పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే |

అని చెప్పబడినది కనుక ఆ ప్రకారంగా వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. 

హనుమంతుని జనన గాథను, హనుమాన్ చాలీసాను, ఆంజనేయ స్తోత్రాలను ఈ రోజు ప్రత్యేకంగా పారాయణ చేస్తారు.

హనుమంతుని జననం | Birth Of Hanuman In Telugu

హనుమాన్ చాలీసా | Hanuman Chalisa

ఆంజనేయ భుజంగ స్తోత్రం – Anjaneya Bhujanga Stotram In Telugu

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here