హనుమత్ లాంగులాస్త్ర స్తోత్రం

0
918

హనుమంతుని “లాంగూలం (తోక) ” జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే సౌమిత్రి జయదాత్రేచ రామదూతాయ తే నమః (నారద పురాణం) అతడు దీర్ఘలాంగూలధారి. రావణునిచే అగ్నిప్రదీప్తమై లంకను కాల్చి వేసింది లాంగూలం. కాశిలో గల భైరవనాథుని సేవించనందు వల్ల తులసీదాసు బాహువునందు ఆ భైరవనాథుడు మహా పీడ కలిగించాడు. అనేక విధాలైన వైద్య చికిత్సలు జరిగినా ప్రయోజనం లేనందున , అప్పుడు తులసీదాసు తనకు రక్షకుడైన హనుమంతుని పొడుగైన తోకతో తన బాహువుని నిమురుమని స్తుతించాడు. ఇదే ” హనుమాన్ బాహుక్ ” అనే పేరు గల స్తోత్రం . వెంటనే బాహుపీడ మటుమాయం అయ్యింది. అందుకే హనుమత్ పూజలలో హనుమత్ వాలాగ్ర పూజకు ఒక ప్రత్యేకత ఉంది. అట్టి పూజ కోర్కెలను తీర్చగలదని, హనుమద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని పెద్దలు చెప్తారు. “హనుమల్లాంగూలాస్త్రం ” చదవడం వల్ల కూడా హనుమదనుగ్రహం కలుగుతుంది.

హనుమన్నంజనీ సూనో మహాబల పరాక్రమ!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
మర్కటాధిప మార్తాండ మండల గ్రాస కారక!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర!
లోలల్లాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
రుద్రావతార సంసార దుఃఖ భారాపహారక!
లోలల్లాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
శ్రీరామ చరణాంభోజ మధుపాయితమానస!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
వాలీప్రమథనక్లాంత సుగ్రీవోన్మోచన ప్రభో!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
సీతావిరహవీరాశగ్న (వారాశిభగ్న) సీతేశతారక!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
రక్షోరాజ ప్రతాపాగ్ని దహ్యమాన జగద్వన!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
గ్రస్తాశేష జగత్ స్వాస్థ్య రాక్షసాంబోధి మందర!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
పుచ్ఛ గుచ్ఛ స్ఫురద్వీర జగద్దగ్థారిపత్తన!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
జగన్మనోదురుల్లంఘ్యా పారావార విలంఘన!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
స్మృతమాత్ర సమస్తేష్ట పూరక ప్రణతప్రియ!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
రాత్రిం చరతమో రాత్రి కృంతనైక వికర్తన!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
భీమాదికమహాభీమ వీరావేశావతారక!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
వైదేహీవిరహ క్లాంత రామరోపైక విగ్రహ!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
అఖర్వ గర్వగంధర్వపర్వతోద్భేదన స్వర!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
లక్ష్మణ ప్రాణ సంత్రాణ త్రాతతీక్ష్ణ కరాన్వయ!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
రామాదివిప్రయోగార్తభరతాధ్యార్తి నాశన!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
ద్రోణాచలసముత్ క్షేపసముత్ క్షిప్తారివైభవ!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత!
లోలలాంగూల పాతేన మమారాతీన్నిపాతయ!!
ఇత్యేవమశ్వత్భతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్ స్వయం యః!
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారుతజప్రసాదాత్!!


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here