హస్త రేఖా శాస్త్రంలో శుక్ర స్ధానము విలువ | Hasta Rekha Sastram Telugu

0
8107
palmistry
హస్త రేఖా శాస్త్రంలో శుక్ర స్ధానము విలువ | Hasta Rekha Sastram Telugu

శుక్ర  స్ధానము

శుక్ర స్ధానము బాగున్నట్లయితే  ఆ జాతకుని శుక్ర జాతకులుగా గుర్తించవచ్చును.  అరచేతిలో శుక్ర స్ధానము బాగుంటే వివాహం వల్ల  స్ధిరాస్ధులు, సుఖ జీవితం లబిస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. బంధువులవలన లాభం పొందుతారు. మంచి సంతానం, సుఖసంతోషాలు లభిస్తాయి. సంసారజీవితంలో బాగా సుఖపడతారు. సంసారజీవితం హాయిగా గడుస్తుంది. డబ్బుకు  లోటు ఉండదు. మంచి విలాసవంతమైన జీవితం లబిస్తుంది. మీకు మంచి అలవాట్లు, మంచి స్నేహం అవసరం.  ముఖ్యంగా బలహీనతలు ఉండరాదు. శుక్ర జాతకులు అదృష్టాన్ని నమ్మవచ్చును. అదృష్టం వీరిని ధనవంతులుగా మారుస్తుంది.

 1. శుక్ర స్ధానముపై రెండు, మూడు నిలువురేఖలుంటే మోసపోతారు.
 2. శుక్ర స్ధానములో లంక గుర్తు ఏర్పడి ఉన్నచో వ్యబిచారము, చెడు అలవాట్లు సూచించును.
 3. శుక్ర స్ధానముపై నక్షత్రము గుర్తు ఉన్నచో కావలసిన ఆప్తులు మరణిస్తారు.
 4. శుక్ర స్ధానముపై పుట్టుమచ్చ ఉంటే సుఖవ్యాదులు వస్తాయి.
 5. శుక్ర స్ధానముపై త్రిభుజం గుర్తు ఉన్నట్లయితే  ప్రేమించిన వారి కొరకు డబ్బు నష్టపోతారు.
 6. శుక్ర స్ధానములో కత్తెర గుర్తు ఉన్నట్లయితే దాంపత్య జీవితంలో బాగా సుఖపడతారు. భార్యభర్తల మధ్య మంచి ప్రేమానురాగాలు ఉంటాయి.
 7. శుక్ర స్ధానముపై చతురంగపాళి గుర్తు ఉంటే వ్యభిచారం, దురఅలవాట్ల వలన అనారోగ్యం, ధననష్టం జరుగును.
 8. శుక్ర స్ధానముపై వృత్తం గుర్తు ఉన్నట్లయితే  చెడు వ్యాదులు రావచ్చును. దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి.
 9. శుక్ర స్ధానముపై ఎక్కువ అడ్డురేఖలుంటే మానసిక ఇబ్బందులు, టెన్షన్ ఉంటాయి. కుటుంబ జీవితం బాగుండదు.
 10. రేఖాశాస్త్ర ప్రకారం చంద్ర స్ధానము, శుక్ర స్ధానము బాగున్నపుడే ఆ వ్యక్తికి సంతోషం,  సుఖం, కుటుంబ  జీవితం బాగుంటుంది. లేనట్లయితే మానసిక ఇబ్బందులు కలుగుతాయి.
 11. శుక్ర స్ధానము బాగుంటే వివాహం వలన స్ధిరాస్ధులు, ధనము రావచ్చును.
 12. శుక్రజాతకులకు ఇల్లరికం, ఇతరులకు పెంపకం వెళ్లడము వలన ధనవంతులు అయ్యే అదృష్టం ఉంటుంది.
 13. శుక్ర స్ధానము బాగుంటేనే బందువులు, పరుల సహాయం లబిస్తుంది.
 14. శుక్ర స్ధానము బాగుంటేనే శాంతి, సుఖము ఉంటాయి.
 15. ఈ శుక్ర స్ధానము బాగుంటేనే అదృష్టం బాగా కలసి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here