పరమ శివుని నిలువెత్తురూపం చూశారా.?- కాకతీయుల కళా ప్రాభవానికి అద్దంపట్టే అద్భుతమైన చిత్రకళ కోట గుళ్లలో కనబడుతుంది. వరంగల్ నుంచీ 40 కిలోమీటర్ల దూరం లో గల ఘనపురం లోని కోట గుళ్ళు రామప్ప దేవాలయాన్ని పోలి ఉంటాయి. 22 ఆలయాల సమూహం ఈ కోట గుళ్ళప్రాంతం. ప్రధానాలయం శివాలయం. ఇక్కడ సర్పధారియై డమరుకాన్ని మోగిస్తున్న పరమ శివుని రూపం అత్యద్భుతంగా చెక్కబడింది.
అంతే కాదు శివపురాణం లోని మరెన్నో కథలూ, గజదళాలు, ఏనుగు సింహం కలిసిన గజకేసరి రూపం, సభామండపం లోని సాలభంజికలు , సుమాలంకృతమైన ద్వార బంధాలూ చూస్తే దేవ శిల్పులే స్వయంగా చెక్కారేమో అన్న అనుమానం కలుగుతుంది. కరుకైన రాళ్లపైన అంత సునిశితమైన రూపాలు మనల్ని ఆశ్చర్యం తో కట్టిపడేస్తాయి. సుదర్శన చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి దివ్యమోహన రూపాన్ని చూసి తీరవలసిందే. 22 ఆలయాలూ దేనికదే ప్రత్యేకమైన శిల్పసంపదను కలిగి ఉంటుంది.
వరంగల్లు లోని ఈ కోటగుళ్లు దర్శించదగిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం.