పన్నెండు మంది సూర్యుల గురించి విన్నారా..? | Have You Ever Heard of Twelve Sun Gods in Telugu

0
7778
పన్నెండు మంది సూర్యుల గురించి విన్నారా
పన్నెండు మంది సూర్యుల గురించి విన్నారా..? | Have You Ever Heard of Twelve Sun Gods in Telugu

 Have You Ever Heard of Twelve Sun Gods in Telugu సూర్యుడు విష్ణుమూర్తి అవతారం. అందుకే ప్రత్యక్ష నారాయణుడనీ సూర్య నారాయణుడనీ పిలుస్తాం. వేదాలలో, పురాణాలలో ద్వాదశాదిత్యుల గురించి చెప్పబడింది. ద్వాదశ అంటే పన్నెండు. ఆదిత్యుడు అంటే అదితీ పుత్రుడు. ఆయనే సూర్యుడు. శ్రీ మహావిష్ణువు పన్నెండు విధాలుగా సూర్యుని రూపం లో దర్శనమిస్తాడు. ఆ పన్నెండు రూపాలను ద్వాదశాదిత్యులు అంటాం. సంవత్సరానికి గల పన్నెండు నెలలలో నెలకొక్క రూపంగా ద్వాదశాదిత్యులు దర్శనమిస్తారు. ఛందోగ్యోపనిషత్తులో పదవ ఆదిత్యుడైన విష్ణువే అదితీ పుత్రుడైన వామనుడు అని చెప్పబడింది.

భాగవత పురాణం లోనూ,లింగ పురాణం లోనూ, బ్రాహ్మణాల లోనూద్వాదశాదిత్యుల ప్రస్తావన ఉంది.

లింగ పురాణం లో గల ద్వాదశాదిత్యుల పేర్లు :- 

 1. వరుణ
 2. మిత్ర
 3. ఆర్యమాన
 4. భాగ
 5. అంశుమాన
 6. ధాతా
 7. ఇంద్ర
 8. సవిత్ర
 9. త్వస్త్ర
 10. విష్ణు
 11. పూషణ
 12. వివస్వత

భాగవత పురాణం లో ఎనిమిదవ ఆదిత్యుని పేరు ‘పర్జన్యుడు’ . బ్రహ్మణాలలో తొమ్మిదవ ఆదిత్యుని పేరు ‘యమ’, పదవ ఆదిత్యుడు ‘సూర్యుడు/అర్కుడు’  పదకొండవ ఆదిత్యుడు ‘దక్షుడు’, పన్నెండవ ఆదిత్యుడు ‘రవి’ వీరే మన పురాణాలలో వేదాలలో చెప్పబడిన పన్నెండుమంది సూర్యులు.

యజుర్వేదం లోనూ,శతపథ బ్రాహ్మణం లోనూ ఎనిమిది మంది సూర్యుల ప్రస్తావనే ఉంది.

సూర్యుడు సత్యానికి ప్రతీక. ధర్మ స్వరూపుడు, కాల స్వరూపుడు. అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞాన కాంతులు వెదజల్లే అద్వితీయమైన శక్తి సమన్వితుడు. సకల జాడ్యాలనూ హరించే తేజోమయమూర్తి. ప్రత్యక్ష భగవానుడు.

శ్లో.    జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం|

         తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం||

శ్లో.      సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం |
         శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here