శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా? | Sri Krishna Parijatham Story in Telugu

0
4431
శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా ...? | sri krishna parijatham story in telugu
శ్రీ కృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా …? | Sri Krishna Parijatham Story in Telugu

Sri Krishna Parijatham Story in Telugu

పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారబంకి జిల్లాలోని కింటూర్ గ్రామం వద్ద ఉంది……..

శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామ కి బహూకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారబంకి జిల్లాలో లోని కింటూర్ గ్రామంలో ఉంది . ప్రపంచంలోకెల్ల విలక్షణమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు దీనిని అభివర్ణించారు. ఇది శాఖ ముక్కలు నుండి పునరుత్పత్తి గాని, పండ్లు గాని ఉత్పత్తి చేయదు. అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గం లో ఉంచబడింది. ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది. అదీ జూన్ / జూలై నెలలో మాత్రమే. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు 1000 నుంచి 5000 సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఈ వృక్ష కాండము చుట్టుకొలత 50 అడుగులుగాను, ఎత్తు 45 అడుగుల గాను చెప్పబడింది. ఈ వృక్షం యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు గాని ఆకులు గాని కుంచించుకుపోయి కాండంలో కలిసిపోవటమే కాని ఎండిపోయి రాలిపోవటం జరగదు.

Related Posts

శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామవళిః – Sri Krishna Ashtottara Satanamavali

Sri Krishna Ashtottara Shatanama Stotram | శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ బాలకృష్ణ అష్టకం – Sri Balakrishna Ashtakam

Sri Krishna Stotram (Vasudeva Krutam) | శ్రీ కృష్ణ స్తోత్రం (వసుదేవ కృతం)

Sri Krishna Stotram (Narada Rachitam) | శ్రీ కృష్ణ స్తోత్రం (నారద రచితం)

Sri Krishna Stotram (Bala Krutam) | శ్రీ కృష్ణ స్తోత్రం (బాలకృతం)

శ్రీ కృష్ణస్తవరాజ – Sri Krishna Stavaraja

Sri Krishna Dwadasa Nama Stotram | శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం

కృష్ణాష్టకం – Krishnashtakam

శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం | Lord Krishna Greatness in Telugu

Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?

శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu

శ్రీ కృష్ణుడు కృపకు ఎవరు పాత్రులు ? | Lord Sri Krishna Grace in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here