
Health Benefits of Beetroot – బీట్రూట్ తరచుగా తినడం వల్ల రక్తహీనత దరిచేరదు. బీట్రూట్ లో కొవ్వు పదార్థాలు తక్కువస్థాయిలో ఉంటాయి. ఇందులోని ఫోలెట్, మాంగనీస్,పొటాషియం, ప్రాస్ఫరస్ లు,పీచు పదార్థాలు శరీరానికి కావలసిన పోషణను అందిస్తాయి.చర్మం పై వయసు ప్రభావం ఎక్కువగా పడనివ్వకుండా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఐరన్ మరియు బి6 విటమిన్లు శరీరానికి రోగ నిరోధక శక్తిని ఇస్తాయి. అంతేకాదు బీట్రూట్ తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వాతాన్ని తగ్గించే శక్తి కూడా బీట్రూట్ సొంతం. అతిగా తినడం వల్ల వేడి చేసే ప్రమాదం ఉంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.