
Health Benefits Of Onion – రోజుకో ఉల్లిపాయను తింటే వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని పలు పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తరచూ దీన్ని తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. ఉల్లిపాయలు యాంటీ హిస్టామైన్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆస్తమాతో బాధపడుతున్న వారికి చక్కగా పనిచేస్తాయి.
అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఉన్నాయి. ఉల్లిపాయల్లోని ఔషధ కారకాలు శ్వాసనాళాలను వెడల్పు చేస్తాయి.
2. పసుపు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.
పేగుల్లో వృద్ధి చెందే క్యాన్సర్ కారకాలను ఈ మిశ్రమం తొలగిస్తుంది. ఉల్లిపాయలను తరచూ తీసుకుంటే శరీరంలోని హానికర కార్సినోజెన్లు, విషపదార్థాలు బయటకు పంపివేయబడతాయి.
3. ఉల్లిపాయలను ఎంత ఎక్కువగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ అంత తక్కువవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
వీటిలోని ‘అలిల్ ప్రొపైల్ డైసల్ఫైడ్’ శరీరంలో స్వతహాగా తయారయ్యే ఇన్సులిన్‌ను పెంచడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
రోజూ కొంత మోతాదులో ఉల్లిపాయలను తింటే రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ కెమిస్ట్రీ’ ఓ కథనాన్ని కూడా ఇప్పటికే ప్రచురించింది.
4. రక్తపోటును తగ్గించడంలో ఉల్లిపాయలు ఎంతగానో దోహదపడతాయి. రక్తపోటును నియంత్రణలో కూడా ఉంచుతాయి. రక్తనాళాలకు సాగే గుణాన్ని పెంచడంతోపాటు వాటిని వెడల్పు కూడా చేస్తాయి.
5. ఉల్లిపాయలను తిన్న అనంతరం నోరు అదోరకమైన వాసన రావడం సహజం. అయితే ఇలా రావడం మాట అటుంచితే వీటిని తినడం వల్ల దంతాలు, ఇతర నోటి సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
ఉల్లిపాయలను పచ్చిగా తింటే దంతాలు దృఢమవుతాయి. నోటిలోని చెడు బాక్టీరియా నాశనమవుతుంది. దంత క్షయం తొలగిపోతుంది.
2 నుంచి 3 నిమిషాల పాటు ఉల్లిపాయను బాగా నమిలితే నోటిలోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి ఇంకా రోజు ఉల్లిపాయలు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి….