
కమలా పండు తినడం వలన | Orange Health Benefits in Telugu
కమలా ఫలంలో సిట్రస్ లిమినోయిడ్స్ ఉంటాయి
కమలా పండులో మాంసకృత్తులు, పిండి పదార్థాలు, పీచుతోపాటు ఖనిజ లవణాలైన క్యాల్షియం, ఫాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం పుష్కళంగా లభిస్తాయి. ఇందులోని ఏ, సీ విటమిన్లతో పాటు థయామిన్, నియాసిన్, రైబోఫ్లేవిన్ తదితరాలు మెండుగా ఉంటాయి.
దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది.
ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాటం చేస్తాయి. అలాగే చర్మం, ఊపిరితిత్తులు, గర్భాశయంనకు సంబందించిన సమస్యలు రాకుండా కాపాడతాయి.
కమలా పండు చర్మసంరక్షణకూ ఉపయోగపడుతుంది.
కమలాపండు తొనలతో చర్మం మీద మృదువుగా రుద్దుకొని కాసేపాగి గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే బ్యాక్టీరియా మొత్తం నశిస్తుంది.
ఈ పండులో బీటాకెరోటిన్ అత్యధికంగా ఉంటుంది.
ప్రతి రోజు కమలా రసం తీసుకోవటం వలన మూత్రపిండాల పనితీరు మేరుగుపరుతుంది. ఈ పండులో విటమిన ఎ ఉండుట వలన కంటి చూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చేస్తుంది. అంతేకాక కాలేయం పనితీరును క్రమబద్దీకరణ చేస్తుంది. కమలా పండులో ఉండే పీచు శరీరంలో ఉండే హానికరమైన కొలస్ట్రాల్ ను కరిగిస్తుంది.
కమలా పండు రసాన్ని స్నానం చేసే నీటిలో కలిపితే శరీర దుర్వాసన మాయమవుతుంది. కమలా రసంలో కొంచెం నీరు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే మృతకణాలు దూరమవుతాయి. ఈ పొడికి కొంచెం శెనగపిండి చేర్చితే చక్కని నలుగులా పనిచేస్తుంది. ముఖం, చేతులు తాజాదనం సంతరించుకోవాలంటే… కమలాఫలం గుజ్జును నేరుగా లేదా కొంచెం తేనె కలిపి రాసుకుంటే సరిపోతుంది.
పొటాషియం ఎక్కువగా ఉండుట వలన గుండెకు రక్తాన్ని సక్రమంగా సరఫరా చేయటానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యర్ధాలను బయటకు పోవటానికి దోహదం చేస్తుంది. అంతేకాక దీర్ఘ కాలిక వ్యాధులను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ పండులో వైరల్ ఇన్ ఫెక్షన్ ను నియంత్రించే పోషకాలు ఉంటాయి. పాడైన కణాలను పునరుద్దరణ చేయటానికి కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి.
కమలాఫలం నేరుగా తినడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కమలాఫలం రసానికి వేపాకుల పొడి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని కడిగేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతిమంతం అవుతుంది. దీని తొక్కలను ఎండబెట్టి పొడిచేస్తే చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది.
ఫోలిక్ యాసిడ్ శాతం కూడా ఎక్కువే కాబట్టి దీనిని ఎక్కువగా తీసుకుంటే మెదడు సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఇందులో ఉండే మెగ్నీషియమ్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
కాల్షియం దంతాలు, ఎముకలను పటిష్టంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
కమలా పండులోని ఫైబర్ శరీరంలోని కొవ్వుశాతాన్ని తగ్గిస్తుంది.
క్షయ, ఉబ్బసంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆయా సమస్యల నుంచి క్రమంగా దూరమవవచ్చు. అలాగే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా, శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గించటంలోనూ కమలా పండు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
న్యూమోనియా వ్యాధితో బాధపడేవారు, కీళ్ల నొప్పులతో ఇబ్బందిపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా కమలా పండును తిన్నట్లయితే ఆ సమస్యలనుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంది. కమలా పండులో లభించే క్యాల్షియం ఎముకలకు దృఢత్వాన్నిస్తుంది. ఈ పండులో అధిక మోతాదులో లభించే ఏ విటమిన్ వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది.
కమలా పండులో లభించే విటమిన్ సీ దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలోనూ ఎంతగానో సహకరిస్తుంది. శరీరం నీరసంగా ఉన్నప్పుడు కమలారసం తీసుకుంటా మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో అధికంగా ఉండే చక్కెర శరీరానికి సత్వర శక్తినిస్తుంది. మలబద్ధకం, తలనొప్పితో బాధపడేవారు ఈ రసంలో ఉప్పు కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. తేనె కలిపి తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులు అదుపులో ఉంటాయి.
కమలా పండులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలు నశించకుండా చూస్తాయి. ఫోలిక్ ఆమ్లం మెదడు పనితీరును మెరుగుపరచి చురుకుగా ఉంచుతుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు విటమిన్ సీ అధికంగా ఉండే కమలా పండు రసం తాగినట్లయితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
Very much useful information thanks a lot.