ఆరోగ్యం కోసం చిట్కా | Health Tips in Telugu

1
6068
5
Health Tips in Telugu

Health Tips in Telugu

Health Tips in Telugu పాలలో 87 శాతం నీరు, 4 శాతం క్రొవు పదార్ధాలు, 4.9 శాతం కార్బోహైడ్రేట్లు, 3.35 శాతం ప్రోటీన్లు, 0.75 శాతం ఖనిజ లవణాలు లభిస్తాయి. పాలలో లాక్టోసు అనే విశిష్టమైన చక్కెర పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. అంతేకాక ఇందులో ఎ, బి, సి, మరియు డి విటమిన్లు కూడా ఉంటాయి .

2 గ్లాసుల పాలు రోజూ తీసుకొంటే బలవర్ధకమైన ఆహారము అందినట్లే.  పాలు అతి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుంది. మహిళలకు వయస్సు మీరే కొద్ది కాల్షియం తగ్గి ఎముకలు విరగడం, ఎముకలకు సంబంధించి వ్యాధులు సోకడం వంటివి జరుగుతున్నాయి అటువంటి వాటి నుండి దూరం అవ్వాలంటే పాలు తాగడం ఉత్తమం.

రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వలన ప్రశాంతమైన నిద్రను పొందుతారు. ఇన్సోమ్నియా (నిద్ర లేమి) నుండీ బయటపడతారు.

జాగ్రత్తలు

పాలలో ఉండే అన్నీ సుగుణాలూ పాలపొడిలో ఉండవు. కనుక తాజా పాలకు బదులుగా పాలపొడితో పాలను తయారు చేసి తాగడం వలన జీర్ణ సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. పాలు మితిమీరి  తాగడం వలన అరుగుదల సమస్యలు రావడం, మజ్జు, మరియు ఊబకాయం కలుగుతాయి. కనుక మోతాదు విషయం లో జాగ్రత్తలు వహించాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here