దత్తాత్రేయస్వామిని ఆరాధన చేయడం వలన కష్టాలు దూరమవుతాయి , సంపదలు చేకూరతాయి ,దత్త నామస్మరణము వలన అనారోగ్యా లు దూరమయ్యి ఆయురారోగ్యాలను పొందవచ్చును సంపదలు పొందవచ్చును గురువారం రోజున దత్తాత్రేయస్వామిని ‘పసుపురంగు పూలతో ఆరాధన చేయడం ద్వారా ఆనారోగ్య సమస్యలును తొలగించి ఆయురారోగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చును
దత్తాత్రేయస్వామి స్తోత్రం
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు!!
దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు!!
శరణ గతదీనార్తపరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనో వతు!!
సర్వానర్ధహరం దేవం సర్వమంగళ మంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనో వతు!!
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనో వతు!!
శోషణం పాపపంకస్య దీపనంజ్ఞానచేతసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనో వతు!!
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనో వతు!!
జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్శ్రేయసవదం వందే స్మర్తృగామీ సనో వతు!!
జయలాభయసః కామదాతు ర్దత్తస్య హః స్తవం భోగమోక్షప్రస్యేమం య పఠేత్ సుకృతీ భవేత్!!