
1 నోటి పూత కు గోరింట. ఒక గ్లాసు మంచి నీటి లో పది, పదిహేను గోరింటాకులు వేసి చిన్న మంట పైన ఒక కప్పు కషాయం మిగిలే వర కు మరిగించాలి. తరువాత వడబోసి ఆ కషాయం గోరువెచ్చగాఅయిన తరువాత నోటి లో పోసుకొని పది నిమిషముల పాటు పుక్కిలింఛి ఊసి వేయాలి ఇలా రోజు రెండు పూటల చేస్తే ఎంతటి తీవ్రత గల నోటి పూత అయినా త్వరగా తగ్గిపోతుంది
2 తలనొప్పి నివారణకు
గోరింటాకు ను మెత్త గా గుజ్జు లా నూరి కణతల పైన పట్టు లాగ వేసి విశ్రాంతి తీసుకోవాలి కణతల పైన వేసిన గోరింట గుజ్జు ఎండిపోయేటప్పటికి తలనొిప్పి తగ్గిపోతుంది
3గాయలకు మొండి గాయాల కు లేపనం చేయటం వల్ల గాయాలు అతి త్వరగా గా మాడిపోయు తిరిగి చర్మము రంగు వస్తుంది
4చర్మ సమస్యల కు దురదలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు అప్పటికప్పుడు ఏ రోజుకారోజు పచ్చి గోరింటాకు ను మెత్తగా రుబ్బి ఆ గుజ్జును చర్మ సమస్యలు ఉన్న చోట దట్టం గా లేపనం వేయాలి. లేపనం ఎండి పోయి న తర్వాత కడిగి వేయాలి చర్మ సమస్యలు చాల సులువుగా తగ్గిపోతాయి
5 తల వెంట్రుకలు కు గోరింటాకు రసం 200 గ్రాములు
నల్ల నువ్వుల నూనె 400 గ్రాములు
ఒక పాత్రలో పోసి చిన్న మంట పైన మరిగించాలి. నూనె మాత్రమే మిగిలిన తరువాత దించి వడబోసి నిలువ ఉంచుకోవాలి ఈ తైలాన్ని ప్రతి రోజు తలకు రాసుకుంటుంటే తల వెంట్రుకలు క్రమంగా దట్టం గా అందం గా తయారవుతాయి